ద విజ‌న‌రీ లీడ‌ర్‌… చంద్ర‌బాబు ప్ర‌స్థానం.. బ‌ర్త్ డే స్పెష‌ల్‌

ఈ రోజు టీడీపీ అధినేత చంద్ర‌బాబు పుట్టిన రోజు. చంద్ర‌బాబు నేటితో 73వ వ‌సంతంలోకి అడుగు పెట్టారు. అయితే.. ఈ 73 ఏళ్ల జీవిత కాలంలో ఆయ‌న ఎదుగుల‌ను ప‌రిశీలిస్తే.. ఇంతింతై.. అన్న‌ట్టుగానే సాగింది. విద్యార్థి నాయ‌కుడిగా ప్రారంభించిన ప్ర‌స్థానం.. అనూహ్యంగా రాజ‌కీయాల వైపు మ‌ళ్లింది. త‌ర్వాత కాలంలో ఎమ్మెల్యేగా ఎదిగారు. కాంగ్రెస్‌లో పుంజుకుంటున్న స‌మ‌యంలో అనూహ్యంగా అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలోకి వ‌చ్చారు.

In Naidu directed drama 25 years ago, seasoned politician-actor NTR booted  out of power

ఇక‌, టీడీపీలోకి రావ‌డానికి ముందు.. త‌ర్వాత అన్న‌ట్టుగా చంద్ర‌బాబు ప్ర‌స్థానం సాగింద‌నే చెప్పాలి. ఇది లావుంటే.. రాజ‌కీయాల్లో ఆయ‌న తొలినాళ్ల‌లో ఎదుర్కొన్న ఇబ్బందులు.. త‌ర్వాత అతి త‌క్కువ కాలంలో అధిగ‌మించారు. అంతేకాదు.. పెద్ద పెద్ద ప‌ద‌వులు కూడా అందుకున్నారు. ముఖ్యంగా ప్ర‌తి ఒక్క‌రూ ఆర్థికంగా బ‌లంగా ఉంటేనే త‌ప్ప‌.. స‌మానత్వం సాధించ‌లేమ‌న్న‌.. సిద్ధాంతాన్ని ప్ర‌తిపాదించ‌డ‌మే కాదు.. దానిని తూ.చ త‌ప్ప‌కుండా అమ‌లు చేశారు.

N. Chandrababu Naidu | Biography & Facts | Britannica

ఇటు పాల‌నలోనే కాదు.. ఇటు వ్య‌క్తిగ‌తంగా కూడా చంద్ర‌బాబు త‌న‌దైన ముద్ర వేశారు. టీడీపీలోనే కాకుండా.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న పాల‌న‌ను త‌న‌దైన శైలిలో సాగించారు. ఆదిలో చంద్ర‌బాబును సీఈవో అనే ముద్ర సాధించారు. ఇది కొంత న‌ష్టం చేకూర్చిన మాట వాస్త‌వం.. దీనిని గుర్తించిన చంద్ర‌బాబు వెంట‌నే దీని నుంచి ప్ర‌జ‌ల వైపు మ‌ళ్లేందుకుఎలాంటి సంకోచం లేకుండా ప్ర‌య‌త్నాలు చేశారు. అభివృద్ధి నినాదంతో గ‌తంలో హైద‌రాబాద్‌ను.. త‌ర్వాత ఏపీలో అమ‌రావ‌తిని ఆయ‌న అభివృద్ధి చేసిన తీరు న‌భూతో అనే చెప్పాలి.

Performance matters, not my age, says 72-yr-old TDP chief Naidu as he aims  to reclaim Andhra

అమ‌రావ‌తి మ‌ధ్య‌లో నిలిచిపోయినా..చంద్ర‌బాబు ముద్ర మాత్రం శాస్వ‌తంగా క‌నిపిస్తోంద‌నే వాద‌న ఉంది. ప్ర‌తి కుటుంబానికి డ‌బ్బులు పంచ‌డాన్ని వ్య‌తిరేకించ‌క‌పోయినా.. కేవ‌లం.. డ‌బ్బులు మాత్ర‌మే కాదు.. విద్య‌, ఉపాధి, విజ్ఞానం వంటివి పంచ‌డం ద్వారా కుటుంబాల్లో ఆర్థిక స్వావ‌లంబ‌న సాధించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని మ‌న‌సా వాచా న‌మ్మారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. ఒకానొక ద‌శ‌లో సొంత పార్టీ నాయ‌కులే విస్మ‌రించినా.. చంద్ర‌బాబు ముందుకు సాగారు. అదే ఆయ‌న‌ను చ‌రిత్ర గ‌తిలో ఒక అధ్యాయం ఏర్పాటు చేసుకునేలా చేసింది.

CM Chandrababu Naidu stages protest against IT raids on TDP leaders