చంద్ర‌బాబు న‌యా స్ట్రాట‌జీ ‘ ఐడియాల‌జీ కాన్సెప్ట్ ‘ … దీని స్పెష‌ల్ ఏంటంటే..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆదిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న ప్ర‌క‌టించిన ప‌థ‌కం.. ఐడియాల‌జీ కాన్సెప్టు!..ఇది వినేందుకు బాగానే ఉన్నా.. అర్ధం చేసుకోవ‌డం మాత్రం కొంత లోతుగా ఉంటుంది. రాష్ట్రంలోనిప్రతి కుటుంబానికీ ఆర్థిక ప్రగతి ఫలాలు అందించాల‌నేది ఈ కార్య‌క్ర‌మం ఉద్దేశం. దీనిని ఆయ‌న త‌న పుట్టిన రోజు సంద‌ర్భం గా మార్కాపురంలో ప్ర‌క‌టించారు.

TDP chief N Chandrababu Naidu accuses NDA govt of using CBI, IT to harass  rivals, create fear - The Economic Times

ఆర్థిక ప్రగతి అనేది .. అన్ని కుటుంబాలకు అందేలా చూడడం `ఐడియాల‌జీ కాన్సెప్ట్‌` విధానం. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే ఈ కాన్సెప్టును పక్కాగా అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రత్యే కంగా ఒక శాఖను ఏర్పాటు చేస్తారు. ఈ లక్ష్యం ఎలా సాధించాలన్నదానిపై ఒక విధానాన్ని కూడా రూపొందిస్తారు. ఒక కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని దానిని ఆర్థికంగా ప‌రిపుష్టం చేయ‌డ‌మే.. ఈ కాన్సెప్టు ల‌క్ష్యంగా ఉంది.

15-20 ఏళ్లలో ఈ అభివృద్ధి ఫలాలు అందుతాయి. రాష్ట్రంలో పోర్టులు, నగరాలను అభివృద్ధి కేంద్రంగా మలిస్తే వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివ‌సిస్తున్న వారికి అభివృద్ధి ఫలాలు అందుతాయి. ప్రతి కుటుం బ వాస్తవ స్థితిగతులు, ఆ కుటుంబంలోని మానవ వనరులు వంటివి పరిగణనలోకి తీసుకుని ఒక ప్రణాళిక తో వెళ్తే 10-15 ఏళ్లలో మొత్తం కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తేవచ్చు.

New Andhra Pradesh Chief Minister Chandrababu Naidu Vows to be 'Coolie No  One'

ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ప్రతి కుటుంబం పరిస్థితిని పర్యవేక్షించడం కీల‌కం. దీనికి సంబంధించి ప్ర‌త్యేకంగా ఒక సాఫ్ట్ వేర్‌ను ఏర్పాటు చేసుకుంటారు. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన 4 అంశాల‌ను ప్ర‌స్తావించారు.

+ సమానత్వ హక్కును పునర్నిర్వచించి సమాజంలో ఆర్థిక అంతరాలు లేకుండా చేయడం.
+ 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అవుతుంది. ఆ నాటికి తెలుగు సమాజం పేదరికం లేని సమాజంగా దేశంలో నిలవాలి.
+ సాంఘిక సాంస్కృతిక వెనుకబాటు కూడా సమాజంలో కొన్ని కులాలు, వర్గాల వెనుకబాటుకు కారణమవుతోంది. ఆయా వర్గాలకు ఆర్థిక, సామాజిక వారధి నిర్మాణంపై దృష్టి సారించాలి.
+ ప్రవాసాంధ్రులు, సంపన్న తెలుగు వర్గాల వారికి భాగస్వామ్యం కల్పించి కొన్ని కుటుంబాలను ఆర్థికంగా పైకి తేవడానికి కృషి చేయాల్సి ఉంటుంది.