శభాష్ బాలయ్య.. పులి బిడ్డ అనిపించాడుగా..చేతులెత్తి దండం పెట్టాల్సిందే..నిజంగా గ్రేట్..!!

టాలీవుడ్ నందమూరి హీరోగా పేరు సంపాదించుకున్న తారకరత్న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే . చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ యువ గళం పేరిట ప్రారంభించిన పాదయాత్రలో భాగంగా పాల్గొన్న తారకరత్న గుండెపోటుకి గురై కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన టిడిపి కార్యకర్తలు ఆయనను హుటాహుటిన హాస్పిటల్ లో చేర్పించారు . మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చేర్పించారు .

Nandamuri Taraka Ratna's Wife Alekhya Reddy Falls Sick; To Be Admitted In A Hospital? - Filmibeat

కాగ 23 రోజుల పాటు సుదీర్ఘంగా ప్రాణాలతో పోరాడిన ఆయన మృత్యువు చేతిలో ఓడిపోయి తన ప్రాణాలను విడి చేశారు. ఈ ఊహించని పరిణామంతో నందమూరి ఫ్యాన్స్ కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు . ఇప్పుడిప్పుడే ఆయన మరణించిన బాధనుండి నెమ్మదిగా కోలుకుంటుంది తారకరత్న ఫ్యామిలీ . కాగా తారకరత్న హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పటి నుంచి అంతక్రియలో చివరి నిమిషం వరకు ఆయన ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకున్నారు బాబాయ్ బాలకృష్ణ. తారక రత్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు బాలయ్య.

Family and fans bid final adieu to Taraka Ratna amid conspiracy claim - The South First

అంతేకాదు ఇప్పటికే తారకరత్న కూతుర్లు కొడుకు బాధ్యత తనదే అంటూ కొత్త బాధ్యత తీసుకున్న బాలకృష్ణ ..ఇప్పుడు మరోసారి తారకరత్నను మర్చిపోలేక తారకరత్న లాగ ఎవరు ప్రాణాలను పోగొట్టుకోకూడదు అంటూ సరికొత్త నిర్ణయాణికి పూనుకున్నట్లు తెలుస్తుంది . బాలకృష్ణ.. తారకరత్న పేరు మీద అందరికీ గుర్తుండిపోయేలా ఓ గొప్ప పని చేస్తున్నారట . ఇప్పటికే ఎన్నోసార్లు హిందూపురం నుండి గెలిచిన బాలకృష్ణ త్వరలోనే హిందూపురంలో ఉన్న హాస్పిటల్లో కార్డియో థోరాసిక్ సర్జరీని అందుబాటులోకి తీసుకువచ్చి ఎంతోమంది పేదవారి ప్రాణాలను కాపాడడానికి పూనుకున్నారు.

ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి నటించిన సినిమాలెన్నో తెలుసా | ntr and his son balakrishna combination movies, balakrishna, ntr, tollywood, father and son movies, ntr and balayya combo, brahmarshi vishwamitra ...

ఈ వైద్యాన్ని బాలకృష్ణ పూర్తిగా ఉచితంగా పేదవారికి అందించడానికి సిద్ధమయ్యారు అంటూ తెలుస్తుంది . హిందూపురంలో బాలకృష్ణ కట్టించిన హాస్పిటల్ లో ఉన్న హెచ్ బ్లాక్ కి తారకరత్న గుర్తుగా తారకరత్న పేరుని పెట్టాలని నిర్ణయించుకున్నారట . ఈ విషయం తెలిసిన నందమూరి ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. “పులి బిడ్డవయ్య ..ఆయన పోలికలే వచ్చాయి నీకు ..అప్పట్లో తారకరామారావు కూడా ఇంతే..ఎవ్వరు కష్టాల్లో ఉన్నా చూడలేరు” అంటూ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అప్పట్లో తారకరామారావు ఎంత మంది జనాలకు హెల్ప్ చేశారో అందరికీ తెలిసిందే. ఇలా జనాలకు మరోసారి నందమూరి బాలకృష్ణ.. నాన్నని గుర్తు చేసి జనాల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు..!!

Tags: balayya, Balayya Babu, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, telugu news, tollywood news, trendy news, viral news