టీడీపీ – జనసేన కాంబో.. కృష్ణాలో ఈ టార్గెట్ సింపుల్‌గా రీచ్ అయిన‌ట్టే..!

తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ పొత్తు దాదాపు ఫిక్స్ అవుతున్నట్లే కనిపిస్తుంది. ఆ రెండు పార్టీలు కలిసే ఎన్నికల బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే తమకు నష్టం తప్పదని జగన్ భావిస్తున్నారు..అందుకే ఏదొక విధంగా పొత్తు చెడగొట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో పదే పదే రెచ్చగొడుతున్నారు. టి‌డి‌పి-జనసేనలకు దమ్ముంటే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు.

అలా చేస్తే ఓట్లు చీలిపోయి తమకు బెనిఫిట్ అవుతుందనేది జగన్ ప్లాన్..కానీ అది వర్కౌట్ అయ్యేలా లేదు. టి‌డి‌పి-జనసేన పొత్తు ఖాయమయ్యేలా ఉంది. పొత్తు ఉంటే వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో వైసీపీకి భారీగా నష్టం జరగడం ఖాయం. అలా భారీ నష్టం జరిగే జిల్లాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా కూడా ఒకటి. టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే ఈ జిల్లాలో వైసీపీకి భారీ నష్టమే. ఇప్పటికే ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేసిన ఈ జిల్లాలో టి‌డి‌పిదే ఆధిక్యం అని తేలింది.

ఇటీవల ఓ సర్వేలో జిల్లాలో 16 సీట్లు ఉంటే టి‌డి‌పి 8, వైసీపీ 5 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, 3 సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని తేల్చి చెప్పింది. టి‌డి‌పి గెలుపు అవకాశం ఉన్న సీట్లు..విజయవాడ ఈస్ట్, సెంట్రల్, మైలవరం, జగ్గయ్యపేట, పెనమలూరు, మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ..ఇక వైసీపీ గెలుపు అవకాశం ఉన్న సీట్లు..పామర్రు, గుడివాడ, గన్నవరం, నూజివీడు, తిరువూరు సీట్లు ఉన్నాయి. టఫ్ ఫైట్ వచ్చి విజయవాడ వెస్ట్, కైకలూరు, నందిగామ సీట్లు.

Prakasam Barrage - Wikipedia

టి‌డి‌పితో జనసేన కలిస్తే విజయవాడ వెస్ట్, కైకలూరు సీట్లలో గెలిచే ఛాన్స్ ఉంది. అటు నందిగామ కూడా గెలవడం సులువే. ఇక నూజివీడు, తిరువూరు స్థానాల్లో వైసీపీపై వ్యతిరేకత ఉంది..వాటిల్లో ఏదొకటి టి‌డి‌పి గెలుచుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే కృష్ణాలో 12 సీట్లు వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, ysrcp