బాలయ్య పెళ్లికి ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం ఏంటి.. ఇదేమి పిచ్చి రా బాబోయ్..!

నటరత్న నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. తెలుగు నాట మహానటుడిగా, మహానాయకుడిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు అందుకున్నాడు.. నటుడుగా ఎన్నో పాత్రలు వేసి దేశంలోనే తెలుగు జాతికి మంచి గుర్తింపు తీసుకువచ్చారు.. అదే తన తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజా సేవకి సమర శంఖం పూరించాడు.. నటుడు గానే కాకుండా నాయకుడిగా గెలిచి తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా కూడా ఎన్నో గొప్ప సేవలు అందించాడు.

NTR Speech - Sr Ntr Movies - Latest Telugu Movie 2019 - YouTube

ఇప్పటికీ ఆయన అందించిన పథకాలనే ఇప్పటి ముఖ్యమంత్రులు కూడా అందిస్తున్నారంటే ఆయన ఆలోచన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో తన సొంత కుటుంబం కంటే ప్రజలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్టీఆర్ కి మొత్తం 12 మంది సంతానం.. అందులో 8 మంది కొడుకులు, నలుగురు కూతుళ్లు.. అందులో ఎన్టీఆర్ కి6,7 సంతానంగా జన్మించిన వారే బాలకృష్ణ రామకృష్ణ.

Balakrishna Age Height Son Daughter Family Photos Biography Profile

కాగా వీరిద్దరికీ ఒకేసారి పెళ్లి జరిగింది.. 1982 డిసెంబర్ 8న తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీరి వివాహం జరిగింది. అయితే వీరి వివాహాని ఎన్టీఆర్ దగ్గరుండి జరిపించలేదట.. ఈ ఇద్దరు కుమారుల పెళ్లి జరుగుతున్న ఎన్టీఆర్ వారి వివాహానికి హాజరు కాకపోవడానికి గల కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నారా..? మరి అది ఏమిటంటే అదే సమయంలో ఎన్టీఆర్ చైతన్య రథం మీద ప్రజా యాత్ర చేస్తున్నాడు.. ఎన్టీఆర్ ప్రచారం చేస్తున్న సమయంలోనే బాలకృష్ణ- రామకృష్ణల పెళ్లి జరిగింది.

Vasundhara And Balakrishna Wedding Photos

యాత్ర మధ్యలో ఆపి వస్తే ఒకరోజు అనవసరంగా వృధా అవుతుంది, కార్యకర్తల ఏర్పాట్లు మొత్తం వేస్ట్ అవుతాయి అనే ఉద్దేశ్యం తోనే ఎన్టీఆర్.. బాలయ్య-రామకృష్ణల పెళ్ళికి రాలేదట. ఇది ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో కూడా చూపిస్తారు. కాగా గత ఏడాది మే 28 నుంచే ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ అంటూ సంవత్సరాది వేడుకలను బాలకృష్ణ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా శత జయంతి అంకురార్పణ సభని కూడా చాలా ఘనంగా నిర్వహించారు.