మాజీ సీఎం కొడుకుకు టీడీపీ అదిరే దెబ్బ..!

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి టి‌డి‌పి షాక్ ఇచ్చేలా ఉంది..ఇటీవల వస్తున్న సర్వేలని బట్టి చూస్తే వైసీపీకి చెక్ పెట్టి టి‌డి‌పి అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తుంది. ఇక జనసేనతో గాని టి‌డి‌పి పొత్తు ఉంటే…వైసీపీకి చుక్కలు చూపించడం ఖాయమే. అయితే గత ఎన్నికల్లో ఓటమి ఎరగని టి‌డి‌పి నేతలని, బడా బడా నాయకులని వైసీపీ ఓడించింది. వచ్చే ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతుందని వైసీపీ నేతలకు టి‌డి‌పి చుక్కలు చూపించడం ఖాయమని తెలుస్తోంది.

వైసీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన నేదురుమల్లి రామ్‌కుమార్ | nedurumalli  ramkumar reddy will join ysr congress party - Telugu Oneindia

ఇదే క్రమంలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి వారసుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి టి‌డి‌పి చెక్ పెట్టేలా ఉంది. నేదురుమల్లి వెంకటగిరి వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేయడం ఖాయం. ఎందుకంటే ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామ్ నారాయణ రెడ్డి వైసీపీకి దూరమైన విషయం తెలిసిందే. ఆయన సొంత పార్టీపై అసంతృప్తితో విమర్శలు చేస్తూ వస్త్న్నారు. దీంతో వెంకటగిరికి నేదురుమల్లిని ఇంచార్జ్ గా పెట్టి ఆనంకు చెక్ పెట్టారు.

ఇక ఆనం టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆయన ఏ సీటులో పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. కాకపోతే వెంకటగిరిలో టి‌డి‌పి ఇంచార్జ్ గా కురుగొండ్ల రామకృష్ణ ఉన్నారు. 2014లో ఈయన టి‌డి‌పి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే వెంకటగిరిలో టి‌డి‌పి బలోపేతం కోసం రామకృష్ణ కృషి చేస్తున్నారు.

MLA Kurugondla Ramakrishna Controversial Comments - Sakshi

ఈ క్రమంలో ఆనం టి‌డి‌పి వైపుకు రావాలని చూడటంతో వెంకటగిరిలో సీన్ మారింది. వెంకటగిరిలో కురుగొండ్ల పోటీ చేసినా, ఆనం పోటీ చేసినా వైసీపీకి చెక్ పెట్టేలా ఉన్నారు. ఎటు చూసుకున్న వెంకటగిరిలో నేదురుమల్లి గెలుపు కష్టమయ్యేలా ఉంది. మొత్తానికి నేదురుమల్లికి టి‌డి‌పి చెక్ పెట్టేలా ఉంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, viral news, YS Jagan, ysrcp