నాలుగేళ్లు ఇంట్లో న‌క్కి.. ఇప్పుడు మంత్రి ప‌ద‌వి కోసం త‌హ‌త‌హ‌లాడిపోతోన్న గంటా…!

తెలుగు రాష్ట్రాలలో ఊసరవెల్లి రాజకీయాలకు పెట్టింది పేరు ఎవరు అంటే ముందుగా మాజీ మంత్రి టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు వినిపిస్తుంది. రాజకీయ అధికారం ఎక్కడ ? ఉంటే గంటా కూడా అక్కడే వాలుపోతూ ఉంటారు. టిడిపి తో కెరీర్ ప్రారంభించిన గంట ఆ తర్వాత ప్రజారాజ్యం, కాంగ్రెస్ తిరిగి టిడిపిలోకి వచ్చారు. గత ఎన్నికలలో టిడిపి ఓడిపోయింది. గంటా మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగేళ్ల పాటు టీడీపీకి భవిష్యత్తు ఉంటుందో ఉండదో ? అన్న సందేహంతో అసలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు.

Ganta Srinivasa Rao to meet Guv for acceptance of resignation | India News  – India TV

కనీసం విశాఖలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గడప కూడా తొక్కలేదు. అదే సమయంలో అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎంతో పోరాటం చేశారు. అయినతోపాటు ఆయన తనయుడు విజయ్ ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. అధికార వైసిపి నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఈ తండ్రీకొడుకులు ఏనాడూ వెనక్కు తగ్గలేదు. ఎప్పుడైతే పార్టీ అధికారంలోకి వస్తుందన్న అశ‌లు మొదలయ్యాయో ? నాలుగేళ్లు ఇంట్లో నెక్కిన గంటా బయటకు రావడం మొదలుపెట్టారు.

వైసిపి గ్రాఫ్ పడిపోయింది అంటూ హడావుడి చేయటం మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన సామాజిక వర్గ నేతలతో టచ్లోకి వెళుతూ మళ్లీ వారిని టిడిపి వైపునకు తిప్పే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టేశారు. ఇప్పుడు అంతా గంటా హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. పైగా మొన్న‌ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి గెలుపును కూడా గంటా ఖాతాలోకి వేసేందుకు ఆయన అనుచరులు విశ్వ ప్రయత్నాలు చేశారు.

Central education institutions to be set up in Andhra Pradesh: Ganta  Srinivasa Rao - The Economic Times

ఇప్పుడు గంట ఇంత హడావుడి చేయడానికి కారణం ఏంటంటే ? వచ్చే ఎన్నికలలో గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి టార్గెట్గా పెట్టుకుని ఇదంతా చేస్తున్నట్టు టిడిపి వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు గంట పార్టీ ఓడిపోయాక వైసీపీలోకి వెళ్లాలా ? జనసేనలోకి వెళ్లాలా అని రకరకాలుగా ఆలోచనలు కూడా చేసిన మాట వాస్తవం. ఆ రెండు పార్టీలకు ఇప్పుడు అంత సీన్ లేదని.. మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తుందన్న ఆశలతో మంత్రి పదవిపై గురిపెట్టే గంటా మళ్లీ హడావిడి రాజకీయానికి తెరలేపారు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp