మైల‌వ‌రం టీడీపీలో ఉక్క‌పోత‌తో ఉక్కిరి బిక్కిర‌వుతోన్న దేవినేని ఉమా.. ఇంత పెద్ద క‌ష్టం వ‌చ్చిందా ?

కృష్ణా జిల్లాలో టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పుడు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సొంత పార్టీ నేతలే ఆయనకు అదిరిపోయే షాకులు ఇస్తున్నారు. ఆ మాటకు వస్తే జిల్లాలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళ్లారు. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో పాటు ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు. దీంతో ఆయనకు మామూలు కష్టాలు రాలేదు. దేవినేని ఉమా సొంత నియోజకవర్గ నందిగామ. అది 2009లో ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అయ్యింది.

Did Devineni Uma Call Pawan Kalyan As Sannasi?

దీంతో 2009, 2014 రెండు ఎన్నికలలోను ఆయన మైలవరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. నందిగామ ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఉమా మైలవరం కు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. అయితే మైలవరం కు ఉమా నాన్ లోకల్ అయినా కూడా అక్కడ పార్టీ క్యాడర్ ఆయనను రెండుసార్లు గెలిపించుకున్నారు. 2014 ఎన్నికలలో ఉమా కేవలం 7000 మెజార్టీతో విజయం సాధించారు. తనకు అంత తక్కువ మెజార్టీ రావడంతో కొందరు టిడిపి నాయకులను ఆయన మంత్రిగా ఉన్న‌ప్ప‌టి నుంచే దూరం పెడుతూ వచ్చారు.

మంత్రిగా ఉండి ఉమా నియోజకవర్గానికి పెద్దగా చేసింది ఏమీ లేదన్న విమర్శలు కూడా మూట‌గట్టుకున్నారు. అందుకే గత ఎన్నికలలో ఉమాపై వసంత కృష్ణ ప్రసాద్ ఘనవిజయం సాధించారు. ముఖ్యంగా కమ్మ సామాజిక‌ వర్గంలోనే కొందరు గత ఎన్నికలలో ఉమాకు వ్యతిరేకంగా వసంతకు అనుకూలంగా పనిచేశారు. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఉమాకు మైలవరం టిక్కెట్ రాకుండా సొంత పార్టీలోనే కొందరు చక్రం తిప్పుతున్నారు.

Devineni Uma Maheswara Rao condemns arrest of Dhulipalla Narendra

 

 

ఆ నియోజకవర్గానికి చెందిన బీసీ నేత సీనియర్ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు ఉమా పై డైరెక్ట్‌గా ఎటాక్ చేస్తున్నారు. తాము పెద్ద పాలేరులుగా పనిచేసి ఉమాను రెండుసార్లు గెలిపించామని.. ఈసారి ఆయనకు ఇక్కడ సీటు ఇస్తే సహకరించేదే లేదని తేల్చి చెబుతున్నారు. తాను మైలవరం నుంచి పోటీ చేస్తానని సంకేతాలు ఇస్తున్నారు. బొమ్మసాని సుబ్బారావుకు టిడిపి నేతలు నుంచి సపోర్ట్ కూడా ఉందని తెలుస్తుంది. ఆయనకు మైలవరంలో మంచి పట్టు ఉంది.

ఇక ఉమాకు జిల్లాలోని టిడిపి నేతలలో చాలామందితో సఖ్యత లేదు. ఇటు ఇప్పుడు నియోజకవర్గంలోనూ తీవ్రమైన వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమా గత ఎన్నికలలో ఓడిపోయారు. దీంతో ఆయన చెప్పినట్టు జరిగే వాతావరణం అయితే ఇప్పుడు జిల్లాలో లేదు. విజయవాడ ఎంపీ కేసినేని నానితో ఉమాకు సఖ్యత లేదు. ఇక జిల్లాలో కొందరు కీలక నేత‌ల‌తోను ఉమాకు సహాయ సహకారాలు సఖ్యత లేవు.

కేశినేని నానికి కేంద్రం కీలక పోస్టు- టీడీపీ అసంతృప్త ఎంపీకి ఆఫర్- ఇక సొంత  జిల్లాలో హవా ..! | vijayawada tdp mp kesineni nani appointed as ntr  district disha committee chairperson ...

ఇప్పుడు వీరిలో కొందరితో పాటు పార్టీలో కీలక నేతలు కూడా ఉమాకు వ్యతిరేకంగా బొమ్మసానికి సపోర్ట్ చేస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా ఉమా లాంటి టాప్‌లీడ‌ర్‌ ఇప్పుడు సొంత నియోజకవర్గంలో టిక్కెట్ కోసం పాకులాడాల్సిన దీనస్థితికి వచ్చేసారు.

Tags: AP, ap politics, devineni uma, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp