బ్యాడ్ సెంటిమెంట్‌కు బ‌లైపోయిన ముగ్గురు స్టార్ హీరోయిన్లు…!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఎదిగిన తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్లుగా స‌క్సెస్ అవుదామ‌నుకుంటే కొంతమంది హీరోయిన్ల‌కు సెంటిమెంట్ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. అయితే తెలుగు స్టార్ హీరోయిన్స్ గా బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ సీన్ రివర్స్ కావడంతో బ్యాడ్ సెంటిమెంట్ కు బలైపోయిన హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందామా..? గతంలో తెలుగు స్టార్ హీరోయిన్స్ గా ఉన్న శ్రీదేవి, జయప్రద ఇలా బాలీవుడ్లోకి వెళ్లి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.

Rashi is stunning with hot photos

అదే బాటలో ఈతరం హీరోయిన్స్ అయినా రష్మిక మందన, పూజా హెగ్డే, రాశీఖ‌న్నా కూడా బాలీవుడ్లోకి అడుగుపెట్టగా వారికి చుక్కెదురయింది. బాలీవుడ్ లో ఛాన్సులు రావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాశీఖ‌న్నా బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. అలాగే పూజా హెగ్డే కూడా కొన్ని సినిమాలలో నటించగా వీరిద్దరూ నటించినా అన్ని సినిమాలు వరుస ఫ్లాప్స్ గా నిలిచాయి.

5 pics that prove Pooja Hegde is the pan-India star we love! | The Times of India

ప్రస్తుతం పూజా హెగ్డే, రాశీఖ‌న్నా వీరిద్దరూ బాలీవుడ్ లో ఒక్క హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. రష్మిక మందన్న‌ నటించిన గుడ్ బై చిత్రం తో పాటు ఆ తర్వాత అక్షయ్ కుమార్ తో తీసిన సినిమా కూడా ఫ్లాప్ అవడంతో రష్మికకు గట్టి దెబ్బ తగిలింది. అయితే ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లోనే యానిమల్ అనే సినిమాలో నటిస్తుంది.

Rashmika Mandhana

ఆమె ఈ సినిమా పైన చాలా ఆశలు పెట్టుకుంది. రష్మిక కు టాలీవుడ్ లో ఇప్పటికీ ఛాన్సులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దాంతో పాటు నితిన్ నటిస్తున్న మరో సినిమాలో నటిస్తుంది రష్మిక.