రాయ‌ల‌సీమ‌లో వైసీపీ గ్రాఫ్ ఢ‌మాల్‌.. ఇంత దారుణంగా ప‌డిపోయిందా…!

వైసీపీ కంచుకోట అయిన రాయ‌ల‌సీమ‌లో ఆ పార్టీ గ్రాఫ్ ప‌డిపోయిందా ? అంటే ప‌లు స‌ర్వేలు అవున‌నే స్ప‌ష్టం చేస్తున్నాయి. వైసీపీకి 2019 ఎన్నికల్లో రాయలసీమలోని మొత్తం 52 సీట్లకు గానూ 49 సీట్లు వచ్చాయి. అంటే 98 శాతం విక్టరీ.. టీడీపీ కేవ‌లం ఉర‌వ‌కొండ‌, హిందూపురం, కుప్పంలో మాత్రమే విజ‌యం సాధించింది. మిగిలిన అన్నీ సీట్ల‌లో వైసీపీ స్వీప్ చేసి ప‌డేసింది. అయితే 2024 ఎన్నిక‌ల్లో సీన్ అలా ఉండని 2014 కంటే కూడా టీడీపీ మ‌రింత స్ట్రాంగ్ అవుతుంద‌ని తెలుస్తోంది.

 

పార్టీ గెలిచిన 2014 ఎన్నిక‌ల్లోనూ వైసీపీ క‌డ‌ప‌లో 1, క‌ర్నూలులో కేవ‌లం 3 సీట్ల‌కే ప‌రిమితం అయ్యింది. అయితే ఈ సారి 2014 కంటే కూడా మ‌రింత స్ట్రాంగ్ అవుతున్న‌ట్టు ప‌లు స‌ర్వేలు చెపుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ సారి కుప్పం, పీలేరు, నగరి, తిరుపతి, చిత్తూరు, మ‌ద‌న‌ప‌ల్లి వంటి సీట్లతో పాటు మరో రెండు సీట్లలో టీడీపీ గెలిచే ఛాన్సులు ఉన్నాయంటున్నారు.

ఇక ఉమ్మ‌డి కర్నూల్ జిల్లాలో చూసుకుంటే పద్నాలుగు సీట్లకు గానూ గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క సీటూ రాలేదు. 2014లో కేవ‌లం మూడు సీట్లే వ‌చ్చాయి. 2024లో డోన్, ప్రత్తికొండ, నంద్యాల, కర్నూల్, కోడుమూరు, ఎమ్మిగ‌నూరు సహా మరో రెండు చోట్ల గాలి వీస్తోందని అంటున్నారు. ఇక క‌డ‌ప‌లో గ‌త ఎన్నిక‌ల్లో జీరో. 2014లో ఒక్క రాజంపేట మాత్ర‌మే టీడీపీ గెలిచింది.

2024లో ఫ‌స్ట్ గెలిచే సీటు మల్లీ రాజంపేటే అంటున్నారు. ఆ త‌ర్వాత కమలాపురం, మైదుకూరు, పొద్దుటూరు అంటున్నారు. క‌డ‌ప‌లో నాలుగు సీట్లు అంటే నిజంగానే గ్రేట్‌. ఇక అనంత‌పురం జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో రెండు సీట్లే టీడీపీకి ద‌క్కాయి. ఈ సారి ఉరవకొండ, తాడిపత్రి, అనంతపురం, రాప్తాడు, హిందూపురం, పుట్టపర్తి ,కళ్యాణ దుర్గం, పెనుగొండ టీడీపీ ఖ‌చ్చితంగా గెలిచే సీట్లు అంటున్నారు. ఏదేమైనా ఈ సారి సీమ‌లో టీడీపీ 25కు పైనే సీట్ల‌లో గెలుస్తుంద‌న్న అంచ‌నాలు ఇప్ప‌టికే ఉన్నాయి.

Tags: ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ycp