ఎన్టీఆర్ పిల్ల‌ల‌కు ఆలియాభ‌ట్ ఇచ్చిన స‌ర్‌ఫ్రైజ్ గిఫ్ట్ ఇదే… నాకూ కావాల‌న్న ఎన్టీఆర్‌..!

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో సీతగా నటించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ ప్రేమికులు అందరిని అలరించింది బాలీవుడ్ ముద్దు గుమ్మ అలియాభట్. ఈ సినిమాతో ఆమె తెలుగు వారికి కూడా బాగా చేరువయ్యింది. నిజానికి అలియా భట్ ను టాలీవుడ్లోకి తీసుకురావాలని గతంలో చాలామంది స్టార్ డైరెక్టర్లు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఎట్టకేలకు త్రిబుల్ ఆర్ సినిమాతో ఆ కోరిక నెరవేర్చాడు దర్శకధీరుడు రాజమౌళి.

When Alia Bhatt Revealed That She Would Be Heartbroken To Be On The Other  Side Of 'Nepotism', Says "If I Were On The..."

తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి ఓ గిఫ్ట్ పంపి తారక్ ను సడెన్‌గా సర్ప్రైజ్ చేసింది. ఎన్టీఆర్ ఇద్దరు పిల్లల కోసం అందమైన దుస్తులను పంపిన అలియా. త్వరలోనే తారక్ కోసం స్పెషల్ అవుట్ ఫిట్ సిద్ధం చేస్తానని కూడా మరో షాక్ ఇచ్చింది. ఇక అలియా రెండేళ్ళ క్రితం దుస్తులకు సంబంధించిన వ్యాపారం లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఇద్దరు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రస్‌ల‌ను ఆమె పంపింది.

ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో పాటు అలియాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. నువ్వు పంపిన ఈ డ్రస్సులు మా పిల్లలకు చాలా బాగా నచ్చాయి.. వాళ్ళ మొహంలో చిరునవ్వులు చూశాను అంటూ థ్యాంక్స్ చెప్పాడు. త్వరలోనే తన పేరు మీద కూడా ఇలాంటి గిఫ్ట్ ఒకటి పంపాలంటూ అలియాను ట్యాగ్ కూడా చేశాడు. దీనికి ఆలియా రిప్లై కూడా ఇచ్చింది. నీకోసం ఈద్ స్పెషల్ అవుట్ ఫుట్‌ సిద్ధం చేస్తాను అంటూనే ఎన్టీఆర్ ను స్వీటెస్ట్ అని పేర్కొంది.

ఇక త్రిబుల్ ఆర్ సినిమా విడుదలయ్యి తాజాగా ఏడాది పూర్తయిన సందర్భంగా ఆలియా తన ఇన్ స్టాలో ప్రత్యేక ఇమేజ్ కూడా షేర్ చేసింది. సినిమాల విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని సినిమాలో న‌టిస్తుంది. ఇక ఇటు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 30వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Tags: Alia Bhatt, bollywood news, film news, filmy updates, intresting news, jr ntr, latest news, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news