Intresting: తప్పదు ఇష్టం లేకపోయినా సరే.. “ఆది పురుష్” హిట్ అవ్వాలంటే ప్రభాస్ అలా చేయాల్సిందే.. !!

ప్రభాస్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా “ఆది పురుష్” బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌట్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 16 జూన్ 2023న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా సీత పాత్రలో అందాల ముద్దుగుమ్మ కృతి సనన్ నటిస్తుంది . ఇప్పటికే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ..ఫస్ట్ లుక్.. టీజర్స్ ట్రైలర్స్ తో ..సోషల్ మీడియా మొత్తం ఆది పురుషు పేరు మారు మ్రోగిపోతుంది .

Adipurush teaser: Prabhas' Lord Ram gets ready to battle Saif Ali Khan's Lankesh in a jerky CGI fest | Entertainment News,The Indian Express

రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రభాస్ అభిమానులను నిరాశపరిచిన విషయం తెలిసిందే. గ్రాఫిక్స్ పెద్దగా చెప్పుకో తగ్గ రేంజ్ లో లేకపోవడం.. తెలిసిన కధనే డీట్టో గా అదే విధంగా తెరకెక్కించడం ..ఎక్కడా కూడా ప్రభాస్ స్టాండర్డ్ కి మ్యాచ్ అయ్యే రేంజ్ లో స్టోరీ కంటెంట్ లేకపోవడం అభిమానులను తీవ్రంగా డిసప్పాయింట్ చేసింది. “ఆది పురుష్” రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందిన విషయం అని అందరికీ తెలిసిందే .

Adipurush - Wikipedia

టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ , కిషన్ కుమార్ ఓం రావత్, ప్రసాద్ రాజేష్ నాయక్ నిర్మిస్తున్న ఈ సినిమా పై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్తో ఆ ఆశలన్నీ నిరాశగానే మిగిలాయి. సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ప్రభాస్ ఆది పురుష్ ని ట్రోల్ చేస్తున్నారు జనాలు . ఈ క్రమంలోనే ఆది పురుష్ సినిమా హిట్ అవ్వాలి అన్నా.. ప్రభాస్ కి మళ్ళీ పునర్ వైభవం రావాలి అన్న ..కచ్చితంగా ఈ సినిమాకి హ్యూజ్ రేంజ్ లో ప్రమోషన్స్ చేసి ..వాళ్ళు ఎంత కష్టపడ్డారు ..వాళ్ళు ఏం ఊహించుకొని సినిమాను తీశారో జనాలకు అర్థమయ్యేలా చెబితే.. ఎక్కడో కొంత ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు .

Adipurush: New Trailer of Prabhas, Kriti Sanon and Saif Ali Khan's Film to  Arrive on Rama Navami 2023 - Reports | 🎥 LatestLY

అలా కాకుండా నేను పాన్ ఇండియా హీరోని అంటూ వీర్రవీగి ప్రమోషన్స్ కి అటెండ్ కాలేదా ..ఖచ్చితంగా ఆది పురుష్ .. రాధే శ్యామ్ కి మించిన బిగ్ డిజాస్టర్ అవుతుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . ఈ క్రమంలోనే ప్రభాస్ కెరియర్ అయోమయ స్థితిలో పడిపోబోతుంది అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . చూడాలి మరి ఆది పురుష్ సినిమాను ఏ విధంగా తన భుజాలపై వేసుకొని హిట్ టాక్ అందేలా చేస్తాడో ప్రభాస్..?