జ‌గ‌న్ కంచుకోట‌లో బాబు కొట్టే గ‌ట్టి దెబ్బ ఇదే… లెక్కలు చెప్పే నిజాలు…!

గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయి..అప్పుడు టి‌డి‌పిపై వ్యతిరేకత..ఒక్క ఛాన్స్ ప్రభావం, ఎన్నికల హామీలు బాగా వర్కౌట్ అయ్యాయి. కాబట్టి భారీగానే సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చాం..అయితే ఈ సారి అధికారంలోకి రావడం అనేది కాస్త కష్టం..కానీ ఎలాగోలా అధికారం దక్కించుకోవాలి..ఉన్నవి లేనివి చెప్పి టి‌డి‌పిని దెబ్బ తీయాలి..ఇక తమని ప్రకాశం టూ కడప బెల్ట్ గట్టెక్కించేస్తుంది..అక్కడ భారీగా సీట్లు వచేస్తాయి..తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ బెల్ట్ లో మళ్ళీ తిరుగుండదు.

Nara Chandrababu Naidu - S. V. College of Arts - Krishna, Andhra Pradesh,  India | LinkedIn

ఈ ప్రాంతంలో మెజారిటీ సీట్లు సాధించింది..కోస్తా, ఉత్తరాంధ్రలో కొంతమేర సీట్లు గెలుచుకునే నెక్స్ట్ ఎన్నికల్లో తిరుగుండదని జగన్ భావిస్తున్నారనే చెప్పాలి. సీమలో 52 సీట్లు, ప్రకాశం-నెల్లూరులో 22 సీట్లు..మొత్తం 74 సీట్లు..వీటిల్లో 60 సీట్లు వరకు గెలిచేసుకుంటే..ఇంకా అధికారంలోకి కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు..భర్తీ కోస్తా, ఉత్తరాంధ్రలో అయిపోతుందని, ఓవరాల్ గా 100 సీట్లు వరకు సాధించవచ్చని జగన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సీమ బెల్ట్ తో వైసీపీ సత్తా చాటడం ఈ సారి సులువా? అంటే కాదనే చెప్పాలి.

గత ఎన్నికల్లో సీమ, ప్రకాశం-నెల్లూరు జిల్లాలు కలిపి వైసీపీ 67 సీట్లు సాధించింది..అంటే 74 సీట్లకు 67 సీట్లు సాధించింది..ఈ సారి 60 సీట్లు అయిన సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. కానీ చంద్రబాబు..జగన్ కు ఈ సారి ఛాన్స్ ఇచ్చేలా లేరు. ఇప్పటికే సీమపై పట్టు సాదించే దిశగా టి‌డి‌పి వెళుతుంది. అటు నారా లోకేష్ పాదయాత్ర కూడా సీమ ప్రాంతంలోనే ఎక్కువ జరుగుతుంది..నాలుగు జిల్లాల్లో బలంపడటమే టార్గెట్ గా పెట్టుకున్నారు.

Jagan Mohan Reddy Birthday: Andhra Pradesh CM Jagan Mohan Reddy turns 48 |  Vijayawada News - Times of India

ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో సీమ బెల్ట్ లో వైసీపీకి దెబ్బతప్పదు. ఒకవేళ వైసీపీకి లీడ్ రావచ్చు గాని..టి‌డి‌పి కూడా బాగానే సీట్లు సాధించేలా ఉంది. సీమ నాలుగు జిల్లాల్లో 52 సీట్లు ఉంటే..టి‌డి‌పి 25 సీట్లు వరకు గెలుచుకునేలా ఉంది. ఇటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 22 సీట్లు ఉంటే..కనీసం 12 పైనే సీట్లు వచ్చేలా ఉన్నాయి..కాబట్టి ఈ సారి జగన్ అనుకున్న విధంగా తూర్పు, పశ్చిమ సీమ బెల్ట్ లో సత్తా చాటడం కష్టమే.