ఆ స్టార్ హీరో సినిమాలో నువ్వే హీరోయిన్‌… ఆమెకు మాట ఇవ్వ‌డం వెన‌క ఇంత మ‌త‌ల‌బు ఉందా…?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతిలో ఓ హీరోయిన్ పడితే ఆమె క్రేజ్ కచ్చితంగా పెరుగుతుంది. ఆమెతో ఒకసారి సినిమా చేస్తే మళ్లీ ఆహీరోయిన్ తోనే రెండు మూడు సినిమాలు చేస్తూ ఉంటారు. గతంలో కూడా సమంతతో అత్తారింటికి దారేది, తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ సినిమాల్లో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఛాయిస్ లో పూజ హెగ్డే ముందు వరుసలో ఉంది.

Trivikram Conversation With Samyuktha Menon | Bheemla Nayak | Pawan Kalyan  | News Qube - YouTube

ఈ ముద్దుగుమ్మను అరవింద సమేత, అలా వైకుంఠపురంలో, అదేవిధంగా మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ssmb28లో హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇదే సమయంలో త్రివిక్రమ్ తన తర్వాత సినిమాల విషయంలో తన చాయిస్ మార్చుకున్నట్టే ఉంది. భీమ్లా నాయక్ సినిమాలో రానాకి జంటగా నటించిన సంయుక్తా మీనన్‌ని త్రివిక్రమ్ దగ్గరుండి ఎంపిక చేశారు. ఆ సినిమాలో ఆమె నటనకి గురూజీ క్లీన్ బౌల్డ్ అయిపోయారట.

Samyuktha Menon: బికినీలో మతులు చెడగొడుతున్న హీరోయిన్ సంయుక్త మీనన్.. |  Noted Malayalam actress Samyuktha Menon hot bikini show going viral in  social media pk– News18 Telugu

ఆ సినిమా దగ్గరనుంచి త్రివిక్రమ్ సంయుక్తా మీనన్‌తో క్లోజ్ గా ఉంటున్నాడు. అలాగే ఆమెకు వరుస సినిమా అవకాశాలు రావటంతో పాటు ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. ఇప్పటికే సంయుక్త బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఆమె విజయాల వెనుక‌ త్రివిక్రమ్ పాత్ర ఉందంటూ ఓ టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు త్రివిక్రమ్ తన తర్వాత సినిమా కోసం సంయుక్తని హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేశారట.

Bimbisara” beauty Samyuktha Menon's glamorous photos

మహేష్‌తో సినిమా కంప్లీట్ అయిన వెంటనేే అల్లు అర్జున్‌తో తన తర్వాత సినిమా ప్లాన్ చేస్తున్నాడు గురూజీ. ఈ సినిమాలో హీరోయిన్‌గా సంయుక్తని ఇప్పటికే కన్ఫామ్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. త్రివిక్రమ్ కూడా ఆమెకి మాట కూడా ఇచ్చేసారట. ఇక మరి త్రివిక్రమ్- అల్లు అర్జున్‌తో సంయుక్తని ఎలా హైలెట్ చేస్తారో ? చూడాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.