బాలయ్య ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..!

అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ విజ‌య‌ల‌ను తన ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లో ఉన్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్‌పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.

NBK 108: Balakrishna's First Look Poster Will Be Unveiled Tomorrow On The Occasion Of The Ugadi Festival

యంగ్ సెన్సేషన్ శ్రీ లీల, బాలీవుడ్ స్టార్ నటుడు అర్జున్ రామ్ పాల్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి థ‌మన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్‌పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Lorry Driver Telugu Full Movie Part 1 || Balakrishna, Vijayashanti - YouTube

ఈ సినిమాలో బాలయ్య డ్రైవర్ గా కనిపించబోతున్నారట. ఆయన ఈ సినిమాలో బస్ డ్రైవర్ గా నటించబోతున్నారని తెలుస్తుంది. ఆయన క్యారెక్టర్ కూడా ఎంతో డిఫరెంట్‌గా అనిల్ రావిపూడి డిజైన్ చేశాడని కూడా అంటున్నారు. అదేవిధంగా గతంలో లారీడ్రైవర్ మూవీలో బాలయ్య డ్రైవర్ పాత్రలో నటించాడు. ఇక అందులో విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. 1990లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు బి. గోపాల్ ద‌ర్శ‌కుడు.

NBK 108 Movie Glimpse || Sreeleela || Nandamuri BalaKrishna || Anil Ravipudi || NS - YouTube

మళ్లీ ఇన్ని సంవత్సరాలకు బాలయ్య డ్రైవర్ క్యారెక్టర్ లో నటిస్తున్నారని ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మరి ఇదే నిజమైతే లారీ డ్రైవర్ సెంటిమెంట్ రిపీట్ అయితే.. ఎన్.బికి 108 సినిమా కూడా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని నందమూరి అభిమానులు ఆశపడుతున్నారు. ఇక మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి అంచనాలు అందుకుంటుందో తెలియాలంటే దసరా వరకు వేచి చూడాల్సిందే.