ఎన్టీఆర్ 30లో జాన్వీక‌పూర్ రోల్ ఇదే… జ‌గ‌దేక‌వీరుడులో శ్రీదేవి పాత్ర‌తో లింక్‌…!

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా దేవ‌ర షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జాన్వీ కపూర్ ఎప్పుడు ఎప్పుడు తెలుగులో నటిస్తుందా ? అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన తెలుగు సినీ అభిమానుల కోరిక ఎట్టకేలకు ఎన్టీఆర్ సినిమాతో నెరవేర నుంది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను జాన్వీకి ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

Title Confirmed For NTR 30 - Telugu Rajyam

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని… రెండో హీరోయిన్ పాత్ర కోసం కొరటాల ఇప్పటికే అన్వేషణ మొదలు పెట్టారని కూడా తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను ఇప్పటికే సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇక దేవర సినిమాలో జాన్వి కపూర్ పాత్ర ఎలా ఉండబోతుంది ? అన్నదానిపై కూడా సినిమా యూనిట్ నుంచి లీకులు బయటకు వచ్చాయి. సినిమాలో జాన్వీ ఓ మ‌త్స్య‌కారుడి కూతురుగా కనిపిస్తోంది అట.

Devara Release Date, Star Cast, Trailer, Budget, Makers, Plot, Box Office, Reviews & More - JanBharat Times

ఇప్పటికే రిలీజ్ అయిన జాన్వీ లుక్ కూడా లంగా వోణీలో పల్చని చీరలో ఉన్నట్టు కనిపించింది. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన జాన్వి లుక్ కూడా అదిరిపోయింది. ఇక సినిమాలో కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుంది అట. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోయేలా ఉంది. జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి సినిమాలో జాన్వీ త‌ల్లి దేవ‌క‌న్య‌గా క‌నిపిస్తుంది.

NTR 30: NTR Jr, Janhvi Kapoor kick off their new film 'NTR 30' with a grand opening ceremony - The Economic Times

ఇప్పుడు ఈమె మ‌త్స్య‌కారుడి కూతురిగా న‌టిస్తుంద‌ని.. సినిమా క‌థ మైథ‌లాజిక‌ల్ ట‌చ్ తీసుకున్న‌ప్పుడు మ‌త్స‌క‌న్య‌గాను కొన్ని సీన్ల‌లో క‌నిపిస్తుంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా నాడు త‌ల్లి దేవ‌క‌న్య‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తే.. ఇప్పుడు కూతురు జాన్వీ మ‌త్స్య‌క‌న్య‌గా ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పిస్తుందో ? చూడాలి.