ప‌విత్రను మ‌హేష్ కూడా లైక్ చేశాడు… న‌రేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ నటుడు నరేష్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ బంధం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ నరేష్ తమ ఇద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని.. తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి విడాకులు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుంటామని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు వీరిద్దరి ఇష్యూలోకి నరేష్ సోదరుడు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వచ్చేశారు. వ‌చ్చాడు అన‌డం కంటే మ‌హేష్‌ను ఈ ఇష్యూలోకి లాగాడు న‌రేష్‌.

Mahesh Babu's Brother, Naresh Gets Married To Pavitra Lokesh, Video From Secret Wedding Goes Viral

మహేష్ బాబుకి నరేష్ కి మధ్య అన్నదమ్ముల బంధం ఉంది. వీరిద్దరి మధ్య కాస్త ఏజ్ గ్యాప్ ఉంది. వీరిద్దరికీ తల్లులు, తండ్రులు వేరు అయిన సూపర్ స్టార్ కృష్ణ పెంపకంలోనే పెరిగారు. నరేష్ 60 ఏళ్ల వయసులో కూడా ఏకంగా నాలుగో పెళ్లికి రెడీ అవుతూ కృష్ణ ఫ్యామిలీ పరువు తీస్తున్నాడు అంటూ కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. వీరి బంధానికి సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి సపోర్టు ఉందా ? లేదా అన్న అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

Mahesh Babu's Brother, Naresh Is Getting Married For The Fourth Time To Kannada Actress, Pavithra?

అయితే తాజాగా వీటికి నరేష్ చెక్ పెట్టాడు. పవిత్రతో తన బంధానికి మిల్కీ బాయ్ మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పాడు. తన తండ్రి కృష్ణతో పాటు సోదరుడు మహేష్‌కు కూడా తమ బంధం గురించి ముందే తెలుసు అని చెప్పాడు. వారు తమ ఇద్దరి బంధానికి ఓకే చెప్పారని.. మహేష్, కృష్ణ గారు, అమ్మ విజయనిర్మల తామంతా ఒకే కుటుంబం అని స్పష్టం చేశాడు.

Are the fights between Mahesh Babu and Naresh real?

మరో ట్విస్ట్ ఏంటంటే తనకు తెలుగు రాదని తెలిసి.. కృష్ణగారితో పవిత్ర ఇంగ్లీషులో మాట్లాడే వారిని కూడా పవిత్ర చెప్పటం గమనార్హం. పవిత్ర లోకేష్ చేసిన వంటలు అంటే కృష్ణ గారు బాగా ఇష్టంగా తినేవారని.. తమ కుటుంబం మొత్తానికి పవిత్ర రుచికరమైన ఫుడ్ వండుతుందని నరేష్ ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. ఇక అందరూ తమ బంధం గురించి అంగీకరించినందుకు తాము చాలా హ్యాపీగా ఉన్నామని.. ఇలాగే సంతోషంగా జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నట్టు నరేష్ చెప్పాడు.