ఇంట్లో చాలా మంది అమ్మాయిల‌తో అలా… జెమినీ గ‌ణేష్‌ కూతురు చెప్పిన సంచ‌ల‌న నిజాలు..!

కోలీవుడ్ లెజెండ‌రీ హీరో జెమినీ గణేష్ నటుడిగా ఎంత ఫేమస్సో ఇండియ‌న్ సినిమా జ‌నాలు అంద‌రికి తెలిసిందే. ఇండియ‌న్ సినీ ప‌రిశ్ర‌మ‌కు జెమినీ చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఆయ‌న‌కు ఉంది. జెమినీ ఎంతో గొప్ప అందగాడు. ఉంగరాల జుట్టుతో పాటు స‌రిప‌డా ఒడ్డు పొడవుతో అప్పటి యూత్‌కు ఓ పెద్ద ఐకాన్‌గా ఉండేవాడు.

Gemini Ganesan controversial life Photos

ఆయ‌న సినిమాల ప‌రంగా ఎంత ఫేమ‌స్సో… వ్య‌క్తిగ‌తంగా, పెళ్లిళ్ల ప‌రంగా కూడా అంతే పాపుల‌ర్ అయ్యాడు. జెమినీ ఎంత గొప్ప న‌టుడు, అభిమానులు ఉన్నా… ఆయ‌న స్త్రీ లోలుడు. అందుకే ఒక‌టి రెండు కాదు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇక అప్ప‌టికే పెళ్ల‌య్యి, పిల్ల‌లు ఉన్న జెమినీ ప్రేమ‌లో మ‌హాన‌టి సావిత్రి ప‌డి పెళ్లి చేసుకోవ‌డం అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌నం.

Gemini Ganesan And Pushpavalli: The Love Story That Was Not Meant To Be | Silverscreen India

త‌ర్వాత వారిద్ద‌రు విడిపోయారు. ఇక జెమినీ కుమార్తె క‌మ‌లా గ‌ణేష‌న్ తాజాగా త‌న తండ్రి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. మా డాడీ చాలా హ్యాండ్‌స‌మ్‌గా ఉండేవాడ‌ని.. ఆయ‌న హెయిర్ స్టైల్ చాలా బాగుండేది… ఆయ‌న పిల్ల‌లు అంద‌రిని ఎంతో ప్రేమ‌గా చూసుకునేవారు.. ప్ర‌తి రోజు డాడీని చూసేందుకు ఇంటికి చాలా మంది అమ్మాయిలు వ‌చ్చేవార‌ని క‌మ‌లా తెలిపింది.

Savitri-Gemini Ganesan love story: Botched affair to the bottle

ఇంట్లో అమ్మ ముందే వారంతా నాన్న మీద ప‌డి.. న‌న్ను పెళ్లి చేసుకో అనేవార‌ని.. కొంద‌రు అయితే వేధించేసే వార‌ని కూడా క‌మ‌లా చెప్పింది. అయితే డాడీ వాళ్లంద‌రిని త‌న‌కు పెళ్ల‌య్యి పిల్ల‌లు ఉన్నార‌ని చెప్పి మ‌రీ పంపేవార‌ని కూడా క‌మ‌లా చెప్పారు. ఇక అమ్మ సావిత్రి, డాడీ పెళ్లి చేసుకోవ‌డం విధిరాత‌… డాడీ ఎవ‌ర్ని ఫోర్స్ చేయ‌లేదు.. ఇద్ద‌రూ ఇష్ట‌ప‌డే పెళ్లి చేసుకున్నార‌ని క‌మ‌లా చెప్పారు.

Everything shown in Mahanati movie is wrong.. What Gemini Ganesan's daughter said gemini ganeshan daughter Kamala

ఇక ఆయ‌న ఏనాడు అవ‌కాశాల కోసం ఇబ్బంది ప‌డ‌లేదు. మ‌హాన‌టి సినిమాలో త‌ప్పుగా చూపించారు.. బయట జరిగింది వేరు. ఆ సినిమా లో చూపించింది వేర‌ని చెప్పింది. ఇక సావిత్రి గారిని కూడా తాను చూశాన‌ని… ఆమె మాతో చాలా బాగా మాట్లాడేవార‌ని… మా అమ్మ గారు కూడా ఆమెతో ఎంతో అప్యాయంగా ఉండేవార‌ని క‌మ‌లా చెప్పారు.