బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా కూడా ఒక్క కంగనా రనౌత్‌కు మాత్రమే ఫైర్ బ్రాండ్ అన్న ఇమేజ్ వచ్చేసింది. కంగనా అటు వైపు స్టార్ హీరోలు ఉన్నా.. కరణ్ జోహార్ లాంటి పెద్ద నిర్మాతలు ఉన్నా.. చివరకు బడా బడా రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు ఉన్నా కూడా కంగనా ఏ మాత్రం లెక్క చేయకుండా తాను చేయాలనుకున్న విమర్శలు, చెప్పాలనుకున్న మాటలు చెప్పేస్తూ ఉంటుంది.
అసలు మనదేశంలో కాస్టింగ్ కౌచ్ పాపులర్ అవ్వడంతో పాటు ఎంతో మంది హీరోయిన్లు, నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి ఓపెన్ అవ్వడానికి కంగన ఇచ్చిన ధైర్యం, ప్రేరణే స్పూర్తి అని చెప్పాలి. ఇక ఇటీవల కంగనాపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ కూడా నడుస్తోంది. ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ధాకడ్ సైతం అట్టర్ ప్లాప్ అవ్వడంతో పాటు అస్సలు వసూళ్లు రాలేదు.
ఆమెపై బాలీవుడ్‌లో స్టార్ హీరోల అభిమానుల నుంచి నెగటవిటీ కూడా ఎక్కువుగా ఉంది. ఇక కంగన బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. కంగన తన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొందరు బాలీవుడ్ హీరోయిన్లు ఏ గ్రేడ్ హీరోయిన్లు అంటూ ఏకి పడేసింది. చాలా మంది ఏ గ్రేడ్ నటీమణులు, హీరోయిన్లు కొందరు స్టార్ హీరోలు, దర్శకుల సినిమాల్లో ఫ్రీగా పని చేసేందుకు కూడా ఓకే చెపుతారని కామెంట్లు చేసింది.
అలాగే ఫ్రీగా పడుకోవడంతో పాటు దర్శక, నిర్మాతలకు రకరకాల పద్ధతుల్లో ఫేవర్ చేసుకునేందుకు ఎంతకు అయినా దిగజారతారన్నట్టుగా కూడా కామెంట్లు చేసింది. దీంతో ఇప్పుడు కంగనా బాలీవుడ్‌లో ఏ హీరోయిన్లు, దర్శక నిర్మాతలను టార్గెట్ చేసింది ? అంటూ సోషల్ మీడియాలో సహజంగానే రచ్చ స్టార్ట్ అయ్యింది.