త‌న‌ అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చి.. డెటాల్‌తో చెయ్యి వాష్ చేసుకున్న స్టార్ హీరో..!

చిత్ర పరిశ్రమలో ఉండే స్టార్ హీరోలని ప్రేక్షకులు, ఎంతలా అభిమానిస్తూ ఉంటారు కొత్తగా చెప్పనక్కర్లేదు.. ఆ హీరోల పుట్టినరోజులు, పెళ్లిరోజులు వస్తే తమ ఇంట్లో వారికే జరిగినట్లు సంబరపడిపోతూ ఉంటారు. అంతే కాకుండా కొందరు హీరోల కోసం అభిమానులు ఎలాంటి పనులు చేయడానికి అయినా ముందు వెనక ఆలోచించరు.

అయితే ఇక్కడ చాలామంది స్టార్ హీరోలు కూడా అలాంటి అభిమానులను బాగా దగ్గర తీసుకొని ప్రోత్సహిస్తూ ఉంటారు. వారిని అభినందిస్తూ వాళ్లతో ఫొటోస్ దిగటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం అభిమానుల్ని అసలు పట్టించుకోరు. ఇప్పుడు ఇదే లిస్టులోకి వస్తాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అంటూ తాజాగా ఓ న్యూస్ వైరల్ గా మారింది.

అజిత్ తన సినిమాలతో ఎంతోమంది అభిమానులను సౌత్ ఇండియాలోనే సంపాదించుకున్నారు. మరి ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత ప్లేస్ ని దక్కించుకున్న ఏకైక హీరోగా అజిత్ నిలిచాడు. ఇదే క్రమంలో అజయ్తికి సంబంధించిన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అజిత్‌ తాజాగా తన అభిమానులను కలిశాడు. ఈ హీరో.. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

ఇక ఆ అభిమాని షేకు హ్యండ్ ఇచ్చిన తర్వాత ఆ చెయి నీ డెటాల్‌తో కడుక్కున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక దీంతో నెటిజన్లు అజిత్‌ ను ఆడేసుకుంటున్నారు.. ఇదేం పైత్యం రా బాబు..నీకు అంత ఇబ్బందిగా ఉంటే అసలు షేక్ హ్యండ్ ఇవ్వకుండా ఉండాల్సింది.. అందరి ముందు పరువు తీసుకోవడం అవసరమా అసలు వాళ్లే లేకపోతే నీకు ఇంత పెద్ద స్టార్డం ఎక్కడిది..? అంటూ తీవ్రంగా మండిపడుతూ నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు.. మరి ఈ వివాదంపై అజిత్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.