గుడివాడలో టీడీపీకి ఇంత బలం ఉందా.. బాబు తేల్చేశారుగా..!

టైమ్ వస్తే తమ సత్తా ఇది అని నిరూపించాలని గుడివాడ తెలుగు తమ్ముళ్ళు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. వరుసగా గుడివాడలో ఓటములు ఎదురైన..అటు వైపు కొడాలి నాని తిరుగులేని విజయాలు సొంతం చేసుకుని..టి‌డి‌పిని ఇంకా తోక్కేయాలని చూస్తున్నా సరే తమ్ముళ్ళు వెనక్కి తగ్గలేదు. పార్టీ కోసం ఇప్పటికీ నిలబడి ఉన్నారు. అధికారంలో ఉన్న ప్రత్యర్ధులకు భయపడకుండా..పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు.

Tension in Gudivada ahead of Naidu's road show

అయితే తమ అధినేతని కొడాలి ఎన్ని బూతులు తిట్టిన ఓపిక పట్టారు. ఇక ఇప్పుడు సమయం ఆసన్నం కావడంతో తమ సత్తా ఏంటో చూపించారు. అసలు గుడివాడలో టి‌డి‌పి పని అయిపోయిందనే అనుకునేవారికి దిమ్మ తిరిగేలా చేశారు. గుడివాడని పసుపుమయం చేశారు. అధినేత చంద్రబాబు పర్యటనని విజయవంతం చేశారు. బాబు పర్యటనకు అడుగడుగున జనం మద్ధతుగా నిలిచారు. ఊహించని విధంగా రోడ్ షో జరిగింది.

గుడివాడలో చంద్రబాబు రోడ్ షో... శరత్ థియేటర్ వద్ద ఉద్రిక్తత

పామర్రులో సాయంత్రం 4 గంటలకు మొదలైన బాబు రోడ్ షో..గుడివాడలో సభా ప్రాంగణంకు చేరేసరికి రాత్రి 10.30 అయింది. పామర్రు టూ గుడివాడ 15 కిలోమీటర్లకే 6 గంటల సమయం పట్టేసింది. అంటే అడుగడుగున చంద్రబాబు రోడ్ షోకు జనం తరలివచ్చారు. దీంతో బాబు రోడ్ షో బాగా ఆలస్యంగా నడిచింది. అలాగే రాత్రి 1 గంట వరకు సభ జరిగింది..కానీ అప్పటికి జనం సభలోనే ఉన్నారంటే..ఎంత కసితో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.

అసలు ఈ స్థాయిలో రోడ్ షో, సభ గాని సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు. కానీ తెలుగు తమ్ముళ్ళు గుడివాడలో తమ సత్తా ఏంటో చూపించారు. గుడివాడలో ఇంకా టి‌డి‌పి బలం తగ్గలేదని చూపించారు. ఇక బాబు సరైన అభ్యర్ధిని డిక్లేర్ చేస్తే..ఇంకా టి‌డి‌పిని గెలిపించడమే తరువాయి అని చెప్పవచ్చు. ఇక కొడాలి నానికి తొలి ఓటమి రెడీగా ఉన్నట్లే కనిపిస్తుంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, trendy news, viral news