ఇండస్ట్రీని కష్టాల్లో పడేసిన ఎన్టీఆర్.. ఏం చేశాడంటే?

ఇటీవల కాలంలో టాలీవుడ్ కష్టాలు ఎదుర్కొంటోంది.. సినిమాలు సరిగ్గా విజయవంతం కావడం లేదు. దీంతో నిర్మాతలు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదట..అందుకే సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఇన్ని కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వల్ల కొత్త కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఇండస్ట్రీ పెద్దలు ఎన్టీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు..

అసలు విషయానికొస్తే.. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసిన విషయం తెలిసిందే.. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కి తెలుగు ఇండస్ట్రీపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఎన్టీఆర్ మాత్రమే కాదు.. హీరో నితిన్ కూడా ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిశాడు. అయితే వీరి భేటీల్లో రాజీకయ చర్చలు జరగలేదని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.. కానీ టాలీవుడ్ హీరోలు బీజేపీ నాయకులను కలవడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కోపంగా ఉన్నారట.

ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో క్యాన్సల్ అయ్యింది. దీనికి కారణం అమిత్ షాను ఎన్టీఆర్ కలవడమే అని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఇండస్ట్రీ వర్గాలు అధికారికంగా వెల్లడించలేదు. పోలీసుల అనుమతి లేని కారణంగానే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అయినట్లు వారు చెబుతున్నారు. అయితే అసలు విషయం మాత్రం అమిత్ షాను ఎన్టీఆర్ కలవడమే అని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీలో జరిగే కార్యక్రమాలకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని అంటున్నారు. ఎలాంటి రాజకీయ కారణం లేకుండా అమిత్ షాను ఎందుకు కలవాల్సి వచ్చిందంటూ.. కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు తారక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.. ఇప్పటికే కష్టాల్లో ఉన్న తెలుగు ఇండస్ట్రీ ఎన్టీఆర్ వల్ల మరింత కష్టాల్లోకి వెళ్లిందంటూ విమర్శలు చేస్తున్నారు. అభిమానులు మాత్రం ఎన్టీఆర్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఎన్టీఆర్ ని విమర్శించే స్థాయి ఎవరికీ లేదంటూ కౌంటర్ ఇస్తున్నారు.