బిగ్‌బాస్ 6లోకి ఉదయభాను అందుకే వెళ్లలేదా?

బిగ్‌బాస్ తెలుగు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే 5 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు 6వ సీజన్ లోకి అడుగు పెట్టింది. ఈ రియాలిటీ షో 6వ సీజన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 4న స్టార్ మాలో బిగ్ బాస్ 6 సీజన్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ షోకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ పై గత మూడు నెలలుగా ప్రచారం ఫుల్లుగా జరింది.. ఈ సీజన్ లో ఎంట్రీ ఇస్తున్న పలువురు కంటెస్టెంట్స్ పేర్లు కూడా వినిపించాయి. అయితే మొదటి నుంచి వినిపించిన కంటెస్టెంట్ల పేర్లలో కొందరు ఈ రియాలిటీ షోలో కనిపిస్తున్నారు. కానీ కొందరు కనిపించడం లేదు.

ముఖ్యంగా ఈ షోలో సీనియర్ యాంకర్ ఉదయభాను పాల్గొంటారని మూడు నెలలుగా ప్రచారం జరిగింది. తీరా కార్యక్రమం ప్రారరంభం అయ్యాక చూస్తే మాత్రం ఉదయభాను కనిపించలేదు. గత రెండు, మూడు సీజన్లలో ఉదయభాను ఉంటుందని అన్నారు. కానీ పిల్లలు చిన్నవాళ్లు అవ్వడం వల్ల ఆమె ఇంట్రెస్ట్ చూపలేదని భావించారు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కావున బిగ్ బాస్ 6 సీజన్ లో తప్పనిసరిగా ఉంటారని అనుకున్నారు. అంతేకాదు ఈ సీజన్ లో ఆమెకు అత్యధిక పారితోషికం దక్కబోతుందని వార్తలు వచ్చాయి. చివరికి ఉదయభాను బిగ్ బాస్ హోస్ లోకి అడుగు పెట్టలేదు.

ఉదయభాను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు బిగ్ బాస్ నుంచి ఉదయభాను ఎందుకు తప్పుకున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. వైల్డ్ కార్డు ఎంట్రీ తో అయినా ఆమె బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడుతుందో లేదో తెలియదు. దీనికి సంబంధించి ఉదయభాను కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఉదయభానుకు అసలు ఏమైంది.. ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్ లో అడుగుపెట్టకపోవడంపై ఆమె మీడియా ముందుకు వచ్చి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా దీనిపై స్పష్టత ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరీ బిగ్ బాస్ కు సంబంధించి ఉదయభాను స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.

Tags: Bigg Boss 6, telugu anchor, Telugu Bigg Boss, Udaya Bhanu