ముంబయి దేశంలో తొలిసారి జువెలరీ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించినట్టు ఆలిండియా రత్నభరణాల దేశీయ మండలి జిజెసి వెల్లడించింది. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 17 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది. తద్వారా గతేడాది పండగ సీజన్ తో పోలిస్తే విక్రయాలలో 35 శాతం మేర వృద్ధిని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇండియాన్ జ్యువెలరీ షాపింగ్ ఫెస్టివల్ లో దేశ వ్యాప్తంగా 5వేల మందికి పైగా జువెలరీ రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో పరిశ్రమ అంతటా వ్యాపార సెంటిమెంట్ ను పెంచేందుకు ఇది సహాయపడుతుందని రత్నభరణాల దేశీయ మండలి ఛైర్మన్ సాయమ్ మెహ్రా అన్నారు.
దీనివల్ల వ్యాపారంతో పాటు వినియోగదారులకు కూడా లాభం జరుగుతుందని చెప్పారు. అలాగే జ్యువెలరీ యజమానులు తన విక్రయాలను విస్తరించుకొనేందుకు ఆలోచిస్తున్నారు. అనంతరం జీజేసి డైరెక్టర్, ఐజేఎస్ఎఫ్ కన్వీనర్ దినేశ్ జైన్ మాట్లాడుతూ… ఈ ఫెస్టివల్ దాదాపు 2.4 మిలియన్స్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది….ఇందువల్ల రూ. 1.2 లక్షల కోట్లు విలువైన విక్రయాలు జరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నట్టు తెలిపారు.