ఆ విష‌యంలో క‌ళ్యాణ్‌రామ్ నెంబ‌ర్ 1… ఇండ‌స్ట్రీలో పోటీ ఇచ్చే హీరో లేడు…!

చాలా మంది హీరోలు ఓ వైపు సినిమాలు చేస్తూనే సొంత బ్యానర్లు స్థాపించి ఇతరుల సినిమాలను నిర్మిస్తున్నారు. నిర్మాతలుగా తమ అభిరుచిని నెరవేర్చుకుంటున్నారు. కొత్త కొత్త హీరోలు, హీరోయిన్లు, దర్శకులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. నందమూరి వంశంలో మూడో తరం వారసుడిగా అడుగు పెట్టిన కళ్యాణ్ రామ్ తొలి చూపులో సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తన తాత మీద అభిమానంతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంస్థను స్థాపించి పలు సినిమాలకు నిర్మాతగా మారారు.

ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేసిన పలువురు డైరెక్టర్లు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన మూడో సినిమా ‘అతనొక్కడే’కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సురేందర్ రెడ్డికి ఇదే మొదటి సినిమా. ఇక ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ తొలిసారి నిర్మాతగా మారారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి కిక్, రేసుగుర్రం, ధ్రువ వంటి హిట్ సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ అయ్యారు.

Athanokkade

 

పటాస్ సినిమాతో అనిల్ రావిపూడిని ఇండస్ట్రీకి కళ్యాణ్ రామ్ పరిచయం చేశారు. ఆయన వరుస హిట్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. వీరితో పాటు సునీల్ రెడ్డి తొలిసారి దర్శకత్వం వహించిన ‘ఓం త్రీడీ’కి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా తొలి ఇండియన్ త్రీడీ సినిమా. అయితే ఇది బాక్సాఫీసు వద్ద పరాజయంగా మిగిలింది. కళ్యాణ్ రామ్‌కు చాలా నష్టాలొచ్చాయి.Bimbisara adds to the 'hit' list | FridayWall Magazine

 

 

ఉపేంద్ర మాధవ్ (ఎమ్ఎల్ఏ), కేవీ గుహన్ (118), వశిష్ట (బింబిసార)లకు కూడా కళ్యాణ్ రామ్ నిర్మాతగా బాధ్యతలు మోశారు. ఆయా సినిమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. అంతేకాకుండా ఇండస్ట్రీకి టాలెంట్ ఉన్న దర్శకులను పరిచయం చేశారనే ఖ్యాతి కళ్యాణ్ రామ్‌కు దక్కింది. ఈ విష‌యంలో ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల్లో క‌ళ్యాణ్‌రామ్‌కు సాటి వ‌చ్చే హీరోయే లేడు

Tags: film news, filmy updates, intresting news, Kalyan Ram, latest news, latest viral news, Nandamuri Family, Nandamuri Hero, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news