ఏపీలో జ‌గ‌న్ వ్యతిరేక కూట‌మి రెడీ… ఏయే పార్టీలు ఉన్నాయంటే…!

ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా గద్దెదించాలన్న పట్టుదల కసి విపక్షాలలో గట్టిగా కనిపిస్తోంది. దాంతో అన్ని పార్టీలు ఇప్పుడు ఒకే రాగం వినిపిస్తున్నాయి. ఒకే గూటికి చేరుకునేలా ఏపీ రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఏపీ పాలిటిక్స్ లో జనసేన కీ రోల్ పోషించేలా కనిపిస్తోంది. తాజాగా ఆ పార్టీ పదో వార్షికోత్సవ సభలో పవన్ కళ్యాణ్ తన పొత్తులతోనే కలిసి వెళతానని క్లారిటీ ఇచ్చేశారు. పవన్ పార్టీ పేరు చెప్పకపోయినా తెలుగుదేశం పార్టీతోనే ఆయన ప్రయాణం ఉంటుందని తేలిపోయింది.

ఇక బిజెపిని వదులుకునేందుకు కూడా తాను సిద్ధం అని పవన్ చెప్పేశారు. బిజెపిని వదిలివేస్తే పవన్ ముందు ఉన్న ఏకైక ఆప్షన్ తెలుగుదేశం మాత్రమే. ఇక సిపిఐ కూడా ఈ కూటమిలో చేరుతుందని అంటున్నారు. తిరుపతిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీలో జగన్ సర్కార్ దిగిపోవడానికి తమ పొత్తులు పెట్టుకుంటామని చెప్పేశారు. ఇప్పటికే సిపిఐ తెలుగుదేశం సన్నిహితంగా ఉంటున్నాయి. మూడేళ్లుగా కలిసి పని చేస్తున్నాయి తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక అవగాహనకు వచ్చాయి.

ఇక ఈ పొత్తులొ సిపిఎం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ కూడా చేరితే మహాకూటమి రెడీ అయినట్టే. దేశంలో కాంగ్రెస్, బిజెపికి వ్యతిరేకంగా పెద్దన్న పాత్ర పోషిస్తుంది. బిజెపి ఏపీకి ఎన్నో హామీలు ఇచ్చి అవేవీ నెరవేర్చలేదు. అందుకే చంద్రబాబు గత ఎన్నికలకు ముందు బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పోలవరం లాంటి విషయాలలో కాంగ్రెస్ హామీ ఇస్తే ఈ కూట‌మిలో కాంగ్రెస్ ను కూడా చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Police issues notices to Pawan Kalyan, asks him to leave Visakhapatnam by 4  PM

ఏదేమైనా బీజేపీ లాంటి ఒకటి రెండు పార్టీలను వదిలేస్తే ఇప్పుడు వైసీపీని గద్దె దించేందుకు దాదాపు అన్ని పార్టీలు ఒకటిగా చేతులు కలుపుతున్న పరిస్థితి. మరి ఈ మహాకూటమి ఎలా ? ఏర్పాటు అవుతుంది జగన్‌ను గద్దె దించేందుకు ఎలాంటి ? ప్రణాళికలు రచిస్తుంది.. అన్నది ఆసక్తి కరం. ఏదేమైనా ఈ ఏడాది అంత ఏపీలో రాజకీయం మంచి రసవత్తరంగా మారనుంది అన‌టంలో సందేహం లేదు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, viral news, YS Jagan, ysrcp