2019లో టీడీపీ ఓడిన ఆ సీట్లో 2024లో 50 వేల‌ మెజారిటీతో గెలవబోతోందా..?

2019 ఎన్నికల్లో ఆ సీట్లో నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని వైసీపీ వాళ్లు కూడా అంచనా వేశారు. అలాంటి చోట అనూహ్యంగా టిడిపి ఓడిపోయి వైసిపి గెలిచింది. నిజంగానే తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్. అలాంటి చోట వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో విజయం సాధించబోతుందా ? అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళే ఎస్ అని చెబుతున్నారు. విచిత్రమింటంటే గత ఎన్నికల్లో అక్కడ మేము ఓడిపోతున్నాం అన్న వైసిపి వాళ్ళు గెలిచారు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ అదే మాట చెబుతోంది. అయితే ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది చూస్తే ఖచ్చితంగా వైసిపి వాళ్ల‌ అంచనాలు తప్పేలా లేవు.

ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ భారీ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించే దిశగా దూసుకుపోతుంది. ఆ సీటు ఏదో కాదు గుంటూరు జిల్లాలోని తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఈ సీటు పై ప్రతి ఒక్కరికి అంత ఆసక్తి ఎందుకు ? అంటే రాజధాని అమరావతి అంతా విస్తరించి ఉన్నది ఈ నియోజకవర్గంలోనే. తాడికొండ, తుళ్లూరు మండలాల్లో అమరావతి కోర్ క్యాపిటల్ అంతా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు మండలాల్లో కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది.

రియల్ ఎస్టేట్ దెబ్బతో ఇక్కడ వాళ్లంతా కోటీశ్వరులు అయ్యారు. విచిత్రమ్ ఏమిటంటే అలాంటి చోట కూడా తెలుగుదేశం ఓడిపోయింది. వైసీపీ నుంచి పోటీ చేసిన ఉండవల్లి శ్రీదేవి అనూహ్యంగా విజయం సాధించారు. అయితే ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణతో ఇక్కడ గత ఎన్నికలకు ముందు వరకు కుబేరులుగా ఉన్నవాళ్లంతా ఇప్పుడు కుదేలు అయ్యారు. పార్టీలతో సంబంధం లేకుండా కులాలు, మతాలు, వర్గాలతో సంబంధం లేకుండా చాలామంది ఆర్థికంగా దెబ్బతిన్నారు.

చాలామంది వ్యాపారాలు కుదేలయ్యాయి. అప్పులు తెచ్చి వ్యాపారాలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వారంతా దివాలా తీశారు. దీంతో ఇప్పుడు వీళ్లంతా లబోదిబోమంటున్నారు. దీనికి తోడు వైసిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఆ పార్టీలోనే తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో అసలు ఆమెకు సీటు ఎవరని ఆమెకు బదులుగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కు తాడికొండ టికెట్ ఇస్తారని వైసీపీలో చర్చ నడుస్తోంది.

జగన్ రాజధాని వికేంద్రీకరణ చేయడంతో తాడికొండ నియోజకవర్గ జనాలు అందరూ తీవ్ర‌మైన వ్యతిరేకతతో ఉన్నారు. దీనికి తోడు వైసీపీలో గ్రూపులు గోల‌ కూడా ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది. ఇక టిడిపి నుంచి ఎవరు ? పోటీ చేసిన నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి ప్రతి మండలానికి పదివేలకు పైగా మెజార్టీ వస్తుందని లెక్కలు వేస్తున్నారు. అసలు ఇంకా బలమైన ఊపు రావడంతో పాటు జనసేన, టిడిపి పొత్తు ఉంటే తాడికొండలో టిడిపి 50 వేల మెజార్టీతో బంపర్ విక్టరీ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని చర్చ నడుస్తోంది. నిజంగా అక్కడ రాజధాని మార్పు ప్రభావం ప్రజల్లో ఆ స్థాయిలో ఉందనేది సత్యం.

Tags: Graph increase of TDP, intresting news, latest news, social media, social media post, tdp, telugu news, trendy news