2019లో వైసీపీ రికార్డులు బ్రేక్ చేసిన సీట్లో 2024లో క్యాండేట్ కరువేనా..?

ఓడలు బండ్లు అవ్వడానికి… బండ్లు ఓడలు అవ్వటానికి ఎంతో కాలం పట్టదు. ఒకప్పుడు ఎంతో గొప్పగా ఒక వెలుగు వెలిగిన వారంతా ఆ తర్వాత కిందకు దిగజారిపోతూ ఉంటారు. ఒకప్పుడు కింది స్థాయిలో ఉన్న వారు కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకుంటూ ఉంటారు. రాజకీయాల్లోనూ ఒకసారి ఈ తరహ పరిస్థితిలే కొనసాగుతూ ఉంటాయి. రాజకీయాల్లో నాయకులు కింద పడిపోవడానికి ఒక చిన్న తప్పుచాలు. అయితే కొందరికి పరిస్థితులు అనుకూలించక రేసులో వెనుకబడిపోతూ ఉంటారు. బహుశా ఈ సూత్రం ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి బాగా వర్తిస్తుంది.

2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాంబాబు.. గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి రికార్డు స్థాయి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి వచ్చిన 90,000 మెజార్టీ తర్వాత గిద్దలూరులో రాంబాబుకు ఏకంగా 81 వేల మెజార్టీ వచ్చింది. టిడిపి నుండి పోటీ చేసిన అశోక్ రెడ్డి పై రాంబాబు ఈ స్థాయిలో బంపర్ మెజార్టీతో అదిరిపోయే రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. అయితే పరిస్థితి ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు గిద్దలూరు ముందు నుంచి రెడ్డి సామాజిక వర్గానికి కంచికోటగా ఉంటూ వస్తోంది.

జగన్ జిల్లాలో వైశ్య‌ సామాజిక వర్గానికి ఒక సీటు ఇవ్వాలన్న ఉద్దేశంతో రాంబాబుకి సీటు ఇవ్వగా ఆయన ఘనవిజయం సాధించారు. పేరుకు మాత్రమే రాంబాబు గత నాలుగు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు. అయితే నియోజకవర్గం లో చిన్న చిన్న పదవుల నియామకాలోను ఆయన మాటకు విలువ లేకుండా పోయింది. చివరకు నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కూడా ఇప్పించుకునే పరిస్థితి లేదు. గిద్దలూరు నియోజకవర్గంలో పదవుల పంపిణీలు అన్ని బాలినేని మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొనసానాల్లోనే జరిగాయి.

దీనిపై రాంబాబు ఎంత నెత్తినోరు మొత్తుకున్న అధిష్టానం కూడా పట్టించుకోలేదు ఇదిలా ఉంటే రాజకీయంగా కూడా ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం రాంబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు ఇస్తే సహకరించే పరిస్థితి లేదని ఓపెనింగ్ చెప్పేస్తుంది. మరోవైపు టిడిపి నుంచి అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సౌమ్యుడు అయిన మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు.

దీంతో పలు మండలాల్లో రెడ్డి సామాజిక వర్గంతో పాటు వైసీపీని.. జగన్ను అభిమానించే వారంతా టిడిపి కండువాలు క‌ప్పుకుంటున్నారు. అసలు గిద్దలూరు నియోజకవర్గంలో ఈ స్థాయిలో మార్పు టిడిపియే ఊహించలేదు. 2019 ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో జండా ఎగరేసిన వైసిపికి.. 2024 లో ఇక్కడ గడ్డు పరిస్థితిలు తప్పేలా లేవు. గెలుపు ఓటములు ఎవరివి అన్నది పక్కన పెడితే వైసీపీకి ఈసారి గిద్దలూరులో గెలవటం అంత ఈజీ అయితే కాదు. అస‌లు క్యాండెట్‌గా ఎవ‌రిని పెట్టాలో తెలియ‌ని డైల‌మాలో ఉంది.

Tags: ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news