భారత క్రికెటర్లకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు మధ్య లింకులు ఎఫైర్లు ఈనాటివి కావు . ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే పలువురు యంగ్ క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లతో లేదా బాలీవుడ్ హీరోల కుమార్తెలతో ప్రేమాయణాలు నడుపుతున్నారు, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే క్రికెట్- బాలీవుడ్ బంధం ఈనాటిది కాదు 40 సంవత్సరాల క్రితమే స్టార్ క్రికెటర్లు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మధ్య ప్రేమాయణాలు డేటింగులు నడిచాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారికతో ప్రేమలో పడ్డాడు వీరిద్దరూ డేటింగ్ కూడా చేశారు. అయితే కపిల్ ఇంట్లో సారికను తమ ఇంటికి కోడలుగా చేసుకునేందుకు ఒప్పుకోలేదు. ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత కపిల్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇటు సారిక కమలహాసన్ ప్రేమలో పడి కమల్‌ను పెళ్ళాడింది. ఇక ప్రస్తుత స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కు సారిక అమ్మ అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కమల్ తో విభేదాలు రావడంతో సారిక అతడి నుంచి విడిపోయి సింగిల్ గా ఉంటుంది.
ఇక మరో మాజీ స్టార్ క్రికెటర్ అజయ్ జడేజా కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ తో ప్రేమలో పడ్డాడు. జడేజా వాళ్లది హర్యానాలోని రాజకుటుంబం. ఒక హీరోయిన్ రాజ కుటుంబంలోకి కోడలుగా రావడం జడేజా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు . తప్పనిసరి పరిస్థితుల్లో జడేజా కరిష్మాకు బ్రేకప్ చెప్పేసాడు. ఆ తర్వాత కరిష్మా అభిషేక్ బచ్చన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇద్దరికీ మధ్య ఎక్కడో గ్యాప్ వచ్చింది విడిపోయారు.
ఓ ఎన్నారై ను పెళ్లి చేసుకుంది ఇద్దరు పిల్లలు పుట్టాక అతడికి కూడా విడాకులు ఇచ్చేసి ప్రస్తుతం ముంబైలో ఉంటుంది. ఇక జడేజా సమతా పార్టీ నాయకురాలు జయ జెట్లీ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఇక భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కూడా తన మొదటి భార్య నౌరీన్ కు విడాకులు ఇచ్చేసి అప్పట్లో బాలీవుడ్ హీరోయిన్‌గా ఉన్న సంగీతా బిజ్లానీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చేశాడు. ఇలా అప్పట్లో ఈ స్టార్ క్రికెటర్లు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో డేటింగ్ లు ప్రేమలు సంచలనం అయ్యాయి.