దగ్గుబాటి వారసుడు అభిరామ్ “అహింస” సినిమా రివ్యూ: సీరియల్ కి ఎక్కువ .. సినిమాకి తక్కువ..!!

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌ పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అందించిన ‘అహింస’ పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా అలరిస్తున్నాయి. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మూవీని చూసిన జనాలు తమదైన స్టైల్ లో రివ్యూ ఇస్తున్నారు.

టాలీవుడ్ విలక్షణ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో ఈ మూవీపై మొదటి నుంచి ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే ఈరోజు ఈ సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయాన్ని మొత్తం మార్చేశాడు దర్శకుడు తేజ.. ఈ సినిమా మొత్తం జయం సినిమాకి సీక్వెల్ గా ఉంది అని.. సినిమా మొదటి నుంచి చివరి వరకు జయం ఫార్ములానే ఫాలో అయ్యాడు.. అదే తరహా లవ్ స్టోరీ.. అదే యాక్షన్ సీన్స్ కాపీ పేస్ట్ చేశారంటూ చెప్పుకొస్తున్నారు.

Ahimsa | అభిరామ్-తేజ టీం క్రేజీ అప్‌డేట్‌.. అహింస రిలీజ్‌ టైం ఫిక్స్-Namasthe Telangana

అంతేకాకుండా ఈ సినిమాకు టైటిల్‌గా అహింస అని ఎందుకు పెట్టారో ఎవరికీ అర్థం కాలేదు. కానీ సినిమాలో హింస మాత్రం బీభత్సంగా ఉందని.. హీరో హీరోయిన్ కోసం ఎంత ఆరాటపడతారో లవ్ స్టోరీ లో బాగా చూపించిన.. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ మాత్రం చాలా క్రూయాలిటీగా చూపించారని అంటున్నారు. అదేవిధంగా ఈ సినిమాలో ప్రతి సీను దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన జయం, నువ్వు నేను సినిమాలను చూసినట్టే అనిపిస్తాయి అంటూ తేజ‌ ఏం మాత్రం మారలేదు అంటూ ఆయనను తిట్టిపోస్తున్నారు.

Ahimsha: 'అహింస'కు తేజ సరికొత్త ప్రచారం.. వాయిస్‌ పోస్టర్స్‌ చూశారా? | ahimsha movie main leads voice posters

ఈ సినిమా మొత్తం మీద సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ హైలెట్గా నిలిచిందని.. అంతే కాకుండా హీరోయిన్ గీతిక తివారి గ్లామర్ కూడా ఆకట్టుకున్న.. హీరో దగ్గుబాటి అభిరామ్ నటన మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పించిందని మరికొందరు అంటున్నారు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టకున్న‌ దగ్గుబాటి అభిమానులకు మాత్రం తీవ్ర నిరాశ మిగిలిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.. మొదటి సినిమాతోనే భారీ హీట్ కొట్టాలన్న ఈ దగ్గుబాటి హీరోకు తొలి సినిమాతోనే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. మొత్తంగా ఈ దగ్గుబాటి వార‌సుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే భారీ నెగటివ్ టాక్ ను తెచ్చుకున్నాడు.. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏవిధంగా ఉంటుందోయో చూడాలి…?