నందమూరి నట వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వారిలో ప్రస్తుతం బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్టార్ హీరోస్‌గా కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా కోట్లాదిమంది అభిమానం సంపాదించుకున్న ఎన్టీఆర్.. తాతకు తగ్గ మనవడిగా తన సత్తా చాటుతున్నాడు. ఇక ఎన్టీఆర్ గతంలో అతని తల్లి షాలినికి ఓ విషయంలో చచ్చిన ఎప్పుడు ఈ తప్పు చేయను అంటూ ఒక ప్రామిస్ చేశాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంతకీ ఎంటా విషయం.. ఏం తప్పు చేయనని ప్రామిస్ చేశాడు.. అనుకుంటున్నారా. నందమూరి ఫ్యామిలీ ఆడవారిని గౌరవించే కుటుంబం అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎన్టీఆర్ తల్లి షాలిని కూడా ఎన్టీఆర్ నుంచి ఇదే ప్రామిస్ ను అడిగిందట. నువ్వు నన్ను కోట్లు సంపాదించి భవనాల్లో ఉంచనవసరం లేదు.. నందమూరి కుటుంబానికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటే చాలు. ఆడవారిని గౌరవిస్తూ ప్రేమ, దోమ అనే వాటికి దూరంగా ఉండి నందమూరి కుటుంబానికి ఎటువంటి నెగటివ్ నేమ్ తీసుకురాకుండా మెలుగుతానని ప్రామిస్ చేయమంటూ కోరిందట.
ఎన్టీఆర్ కూడా అదే విధంగా తల్లికి ప్రామిస్ చేసినట్లుగానే ఇప్పటివరకు ఎటువంటి చెడ్డపేరు తేకుండా నడుచుకుంటున్నాడు. ఎన్టీఆర్ ఆడవారిని చాలా గౌరవిస్తాడు. ఇక అంతే కాకుండా నందమూరి కుటుంబానికి చెడ పేరు తెకుండా తన మాట నిలబెట్టుకోవటమే కాక కుటుంబ ఖ్యాతి మరింత పెంచే విధంగా తన నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.