రచయితలు దర్శకులు కావడం మనం చూసాం.. అందుకు నిదర్శనం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దర్శకులు నటులు అయిన సందర్బాలు చూసాం.. అందుకు నిదర్శనం ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్. దర్శకులు నిర్మాతలు కావడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.. నిర్మాతలు డైరెక్టర్లు అయిన సందర్భాలు ఉన్నాయి. సిని పరిశ్రమలో నటులు దర్శకులు కావడం, నిర్మాతలు కావడం అనేది సర్వసాధారణమైన విషయం. అయితే ఇప్పుడు ఈ యంగ్ హీరో కు దర్శకత్వంపై మనస్సు పడింది.
అందుకే నేను త్వరలో ఓ సినిమాను రూపొందిస్తానని ఘంటాపధంగా చెపుతున్నాడు. హీరోగా కొన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ హీరోకు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదు. సరైన సక్సెస్‌లు లేకపోవడంతో నానా తంటాలు పడుతున్న ఈ యువ హీరోకు ఇప్పుడు దర్శకత్వం చేయాలనే కోరిక బలంగా ఉందని చెప్పుతున్నాడు. ఇంతకు ఈ యంగ్ హీరో ఎవరు అనుకుంటున్నారు. ఆయనే రాజ్‌తరుణ్. సినిమా చూపిస్తా మామ అంటూ అందరికి సినిమా చూపించిన ఈ హీరో దర్శకత్వం చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
అంతే కాదండోయ్ ఈ అబ్బాయి ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని టాక్. తాను ఓ అమ్మాయిని ప్రేమించానని.. ప్రస్తుతం ప్రేమలో ఉన్నానని.. 2022లో తప్పకుండా ఓ ఇంటివాడిని అవుతానని చెపుతున్నాడు ఈ హీరో. ఇక రాజ్ తరుణ్ ప్రస్తుతం దిల్ రాజు సమర్పణలో శీరిష్ నిర్మాతగా జీఆర్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో నటించాడు. ఈసినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమా హిట్ కొడితే తప్ప రాజ్ తరుణ్ కేరీర్‌కు కలిసి రాదు.. లేకుంటే రాజ్ తరుణ్ కేరీర్‌కు కొంత ఇబ్బంది పరిస్థితులు ఎదురయ్యో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.