ఉంగుటూరులో 4 స‌ర్వేల్లో గ‌న్ని వ‌న్‌సైడ్ విక్ట‌రీ… ఈ సారి సెంటిమెంటుతో టీడీపీ విక్ట‌రీ..!

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడు సెంటిమెంట్తో ముడిపడి ఉంటాయి. గత నాలుగు దశాబ్దాలలో ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటూ వస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణ నేపథ్యంలో మరోసారి ఈ నియోజకవర్గంలో కొనసాగుతూ వస్తున్న సెంటిమెంట్ రిపీట్ అయ్యే సంకేతాలు ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే కనిపిస్తున్నాయి.

2014 ఎన్నికలలో ఇక్కడ టిడిపి నుంచి గెలిచిన గన్ని వీరాంజనేయులు గత ఎన్నికలలో వైసిపి ప్రభంజనంలో ఓడిపోయారు. అనంతరం చంద్రబాబు గన్నిపై నమ్మకంతో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. గత రెండేళ్లుగా గన్ని ఏలూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో పార్టీ ఇన్చార్జిలు ద్వితీయ శ్రేణి క్యాడర్ తో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో గన్ని పర్యటించని రోజు అంటూ లేదు.. ఇటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మిగిలిన ఆరు నియోజకవర్గాలతో పాటు ఉంగుటూరు నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి చకచకా కేడ‌ర్‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు.

మరో ఎనిమిది నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వెలువడుతున్న అన్ని సర్వేలు ఉంగుటూరులో గ‌న్ని గెలుపును క్లియర్ కట్‌గా చెప్పేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోన్న రైజ్ స‌ర్వే ఉంగుటూరులో గ‌న్ని సునాయాన విజ‌యం సాధిస్తార‌ని తెలిపింది. ఈ స‌ర్వే రెండు సార్లు చేసిన స‌ర్వేలోనూ గ‌న్ని విజ‌యం సాధించ‌బోతున్నార‌ని తెలింది.

ఇక వైసీపీ అంత‌ర్గ‌త స‌ర్వేలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను జోన్‌ల వారీగా విభ‌జించింది. ఉంగుటూరులో వైసీపీ రెడ్ జోన్‌లో ఉంది. రెడ్ జోన్ అంటే పార్టీ డ్యామ్ షూర్‌గా ఓడిపోయే నియోజ‌క‌వ‌ర్గం. ఇక ప్ర‌శాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం చేసిన స‌ర్వేలోనూ ఉంగుటూరులో వైసీపీ అడ్ర‌స్ గ‌ల్లంతు కానుంద‌ని తేలింది. దీంతో పాటు ఓ నేష‌న‌ల్ మీడియా స‌ర్వేలోనూ ఉంగుటూరులో టీడీపీ ముందంజ‌లో ఉంది. ఓవ‌రాల్‌గా చూస్తే ఉంగుటూరులో గ‌న్ని గెలుపు దిశ‌గా వెళుతున్నారు. ఇక్క‌డ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యి ఏపీలో టీడీపీ కూడా అధికారంలోకి వ‌స్తుందనే అంచ‌నాలు కూడా వెలువడుతున్నాయి.