ఆ లెటర్ చూసి.. ఏడ్చేసిన హైపర్ ఆది..

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు హైపర్ ఆది.. తనదైన పంచుడైలాగులతో ఆడియన్స్ ని నవ్విస్తాడు.. జబర్దస్త్, ఢీ షోలతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మెరుస్తున్నాడు. డబుల్ మీనింగ్ డైలాగులతో, అదిరిపోయే పంచ్ లతో బాగా పాపులర్ అయ్యాడు హైపర్ ఆది. ఇప్పుడు బుల్లితెరపై హైపర్ ఆది తన హవా నడిపిస్తున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ఎప్పుడు ఇతరులపై పంచ్ లు వేస్తూ ఎప్పుడూ చలాకీగా ఉండే హైపర్ ఆది ఇటీవల ఒక షోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు..

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జోడి నంబర్ 1 పేరుతో ఓ ఎపిసోడ్ డిజైన్ చేశారు. ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ 18న ప్రసారం అవుతుంది. అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ షోలో భాగంగా ప్రతి ఒక కమెడియన్ తమ జోడీతో స్టేజ్ పై సందడి చేశారు. ఈ ఎపిసోడ్ లో ప్రతి ఒక్కరికి లవ్ గిఫ్ట్స్ వచ్చాయని యాంకర్ రష్మీ చెబుతుంది. హైపర్ ఆదికి కూడా ఒక గిఫ్ట్ వస్తుంది. అప్పటి వరకు ఎంతో చలాకీగా, అమ్మాయిలతో చిందులేసిన హైపర్ ఆది.. ఆ గిఫ్ట్ చూడగానే కంటతడి పెట్టుకుంటాడు.

ఆ గిఫ్ట్ లో హైపర్ ఆది టెన్త్ క్లాస్ లో తన ప్రియురాలికి రాసిన లెటర్ వచ్చింది. ఆ లెటర్ ని చూసిన ఆది ఎంతో భావోద్వేగానికి గురవుతాడు. తాను రాసిన తొలి ప్రేమ లేఖను చదివిన హైపర్ ఆది ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. టీనేజ్ లో తొలి ప్రేమ చేసిన తీపి గాయాన్ని తలుచుకుని హైపర్ ఆది ఎమోషనల్ గా మారిపోతాడు.. ఎంతో హుషారుగా ఉండే హైపర్ ఆది అలా కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు..

Tags: cryed, Hyper aadhi, latest news, letter, read