బీర్లు తాగ‌డంలో రికార్డులు క్రియేట్ చేసిన హైద‌రాబాదీలు… ఆల్ టైం రికార్డ్‌..!

లిక్కర్ అమ్మకాలు, బీర్ల వినియోగంలో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడూ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఈ మండే ఎండ‌ల్లో మ‌రోసారి రాష్ట్రంలో బీర్ల వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది. ఇంట్ర‌స్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొన్నటి 17వ తేదీ వరకు ఒక్క హైదరాబాద్ లోనే 1.01 కోట్ల బీర్లు తాగేప‌డేశారు హైదరాబాద్ వాసులు. ఇది హైద‌రాబాద్ చ‌రిత్ర‌లో న్యూ ఇయ‌ర్ అమ్మ‌కాల త‌ర్వాత ఆల్ టైం రికార్డుగా నిలిచింది.

Architecture of Hyderabad - Wikipedia

అస‌లు ఈ ఫిగ‌ర్స్ చూస్తుంటే బీర్ల వినియోగంలో హైద‌రాబాద్ జ‌నాలు ఏ స్థాయిలో పీక‌ల్లోతు వ‌ర‌కు తాగేస్తున్నారో తెలుస్తోంది. తెలంగాణలో కొన్ని రోజులుగా ఎండలు విప‌రీతంగా మండిపోతున్నాయి. దీంతో బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. రెగ్యులర్ గా మద్యం తాగే మందురాయుళ్లు కూడా మందు మానేసి ఈ ఎండ‌ల దెబ్బ‌తో బీర్లు తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అందుకే అంత‌లా బీర్ల వినియోగం పెరిగింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లిమిట్స్‌లోని మూడు జిల్లాల్లో కేవ‌లం ఈ 17 రోజుల్లో 8,46,175 కేసుల బీర్లు అమ్మారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో సగటున రోజుకు 6 ల‌క్ష‌ల బీర్లు అమ్ముడు అవుతున్నాయి. అస‌లు ఈ పెరుగుదుల మార్చి నుంచే స్టార్ట్ అయ్యింది. ఇక న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా కూడా ప్ర‌తి యేటా తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వ‌స్తోంది. ఆ త‌ర్వాత ఏప్రిల్ నెల‌లోనే ఈ స్థాయిలో ఆదాయం వ‌స్తోంది.