ఏడు ప‌దుల ఎన‌ర్జిటిక్ లీడ‌ర్‌… తెలుగు పాలిటిక్స్‌లో సీన్ మార్చేది సీబీఎన్ ఒక్క‌డే..!

నారా చంద్రబాబు నాయుడు.. రాజకీయాల్లో ఆయన రికార్డులను ఎవరూ అధిగమించలేరు… ఎన్నో అరుదైన రికార్డులు బాబు సొంతం. స‌మైక్యాంధ్ర ప్ర‌దేశ్‌లోనే ఏకంగా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, విభజన ఏపీలో ఐదేళ్లు సీఎంగా పనిచేసిన ఘ‌న‌త బాబుది. అంటే ఏకంగా 14 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక ప్రతిపక్ష నేతగా కూడా ఎన్నో రికార్డులు ఉన్నాయి. 15 ఏళ్ల పాటు ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు.

Nara Chandrababu Naidu Bio, Education, Family, Political Career, & More

ఓవ‌రాల్‌గా 40 ఏళ్ల నుంచి రాజ‌కీయాల్లో ఉన్నారు. కెరీర్‌లో ఆయ‌న ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. పార్టీ ప‌ని అయిపోయింద‌నుకున్న టైంలో ఆయ‌న గోడ‌కు త‌గిలిన బంతిలా లేస్తూ పార్టీని నిల‌బెడుతూ ఉంటారు. ఈ రోజు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌కాశం జిల్లాలోని మార్కాపురంలో పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్నారు.

చంద్రబాబును కొందరు వెన్నుపోటు దారుడని, నయవంచకుడని ర‌క‌ర‌కాలుగా మాట్లాడుతూ ఉంటారు.
అయితే ఆయ‌న ఆ రోజు ఆ డేర్ స్టెప్ తీసుకుని ఉండ‌క‌పోతే తెలుగుదేశం ఎప్పుడో కాల‌గ‌ర్భంలో క‌లిసి పోయి ఉండేది. ఆ వెన్నుపోటు బాధ ఆయ‌న జీవితాంతం భ‌రిస్తున్నా.. పార్టీని న‌మ్ముకున్న ల‌క్ష‌లాది మంది కార్య‌క‌ర్త‌లు, తెలుగు ప్ర‌జ‌ల కోస‌మే అన్న‌ది నిజం.

Chandrababu Naidu confident of getting special status for Andhra Pradesh |  India.com

అందుకే వెన్నుపోటు అన్న విమ‌ర్శ‌లు వ‌చ్చినా కూడా చంద్ర‌బాబు సామ‌ర్థ్యంపై న‌మ్మ‌కంతోనే ప్ర‌జ‌లు చంద్ర‌బాబును 1999లో గ‌ద్దెనెక్కించారు. గ‌త 15 ఏళ్ల‌లో ఎన్నో క‌ష్టాలు.. బాబు న‌మ్ముకున్న ఎంతోమంది పార్టీని వీడి వెళ్లిపోయారు. టీడీపీ ప‌ని అయిపోయింద‌న్నారు. అయినా 2014లో తెలంగాణ‌లో చెప్పుకోద‌గ్గ సీట్ల‌తో పాటు ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చారు.

ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 23 సీట్ల‌కు ప‌డిపోయింది. తిరిగి నాలుగేళ్ల‌లోనే ఏపీ భ‌విష్య‌త్తు చంద్ర‌బాబుతోనే అనే న‌మ్మ‌కం వ‌ర‌కు పార్టీని తీసుకు వ‌చ్చేశారు. వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డిని చంద్ర‌బాబు ఢీ కొట్టారు… ఆయ‌న త‌రం త‌ర్వాత ఆయ‌న కొడుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఢీ కొడుతూ రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇలా రెండు, మూడు త‌రాల‌కు చెందిన నేత‌ల‌ను ఢీ కొట్టి గెలిచిన ఘ‌న‌త చంద్రబాబుకే ద‌క్కుతుంది.

Chandrababu Naidu to address public meeting today

ఇక ఏడు పదుల వయసులో నేటికీ ఆయన తిరిగినట్లు దేశంలోనే ఏ రాజ‌కీయ నేత తిర‌గ‌డం లేద‌నే చెప్పాలి. ఈ వ‌య‌స్సులోనూ తిరుగులేని ఎన‌ర్జీతో దూసుకుపోతోన్న చంద్ర‌బాబు ఖ‌చ్చితంగా భ‌విష్య‌త్ దేశ రాజ‌కీయాల్లో కీల‌కం అవుతార‌న‌డంలో డౌట్ లేదు. ఆయ‌న‌కు డైలీఆంధ్రా.కామ్ త‌ర‌పున పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాం.