తులం బంగారం రేటు ఒక ల‌క్ష‌… నిజం న‌మ్మాల్సిందే…!

బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు…. కానీ రేట్లు చూసి కళ్ళుతిరుగుతున్నాయి జనాలకి…బంగారం తులం రూ. 1 లక్షకు ఎప్పుడు చేరుతుందో తెలుసా? గోల్డ్ ప్రైస్ గడిచిన ఏడు నెలల నుంచి దాదాపు రూ. 10 వేళ్లకు పైనే పెరిగింది. ఈ ఎడాది మొదట బంగారం ధర రూ. 50 వేలు ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా 60 వేల రూపాయలకు చేరింది.

గడిచిన 20 ఏళ్లుగా మనం గమనించినట్లయితే 2003 లో గోల్డ్ ఖరీదు రూ. 5 వేలు మాత్రమే ఉండేది. సంవత్సరం పెరుగుతున్న కొద్దీ బంగారం ధర కూడాపెరుగుతూ వచ్చింది. ఈ ఏడాదిలో బంగారం ధర తొలిసారిగా 60 వేల రూపాయలకు పైగా దాటింది. త్వరలోనే బంగారం రేటు లక్షల్లోకి వెళ్ళిపోద్ది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

బంగారం ధర పెరగడానికి ముఖ్యంగా అమెరికానే కారణంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఆర్థిక సంక్షోభం కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించి పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ఇండియాలో కూడా గోల్డ్ ఖరీదు భారీగా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

ఈ క్రమంగా ఫ్యూచర్లో బంగారం ధర అందనంత ఎత్తులో పెరగొచ్చు. ఈ సంవత్సరం చివరి నాటికి ఒక లక్ష రూపాయలకు చేరుకోవడం ఖాయమని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే 2024లో బంగారం ధర ల‌క్ష‌ దాటి ఆ పైన కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.