యుద్ధ‌భూమిలో క‌లుద్దాం ఫ్రెండ్‌ అంటూ తార‌క్‌కు హృతిక్ బ‌ర్త్ డే విషెస్‌..!

ఈ రోజు టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ 40వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నాడు. ఎన్టీఆర్‌కు ప‌లువురు సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. ఈ రోజు ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్‌తో సోష‌ల్ మీడియా అంతా హోరెత్తిపోతోంది. సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా కూడా ఎన్టీఆర్ బ‌ర్త్ డే హంగామానే న‌డుస్తోంది.

NTR 30 is Devara: From Cast to Release Date, All You Need to Know About Jr NTR, Janhvi Kapoor and Saif Ali Khan's Upcoming Telugu Film | 🎥 LatestLY

ఇక ఈ రోజు ఎన్టీఆర్ బ‌ర్త్ డే కానుక‌గా ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న 30వ సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు. ఒక రోజు ముందుగానే దేవ‌ర టైటిల్‌తో పాటుఫ‌స్ట్ లుక్ రివీల్ చేసి తార‌క్ ఫ్యాన్స్‌కు మాంచి ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎన్టీఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ సింహాద్రిని రీ రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల‌తో చేస్తోన్న సినిమా త‌ర్వాత కేజీయ‌ఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో మ‌రో సినిమా చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమాయే. ఆ త‌ర్వాత హృతిక్ రోష‌న్‌తో క‌లిసి మ‌రో భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ది నెగ‌టివ్ రోల్ అని ఇప్ప‌టికే టాక్ బయ‌ట‌కు వ‌చ్చింది.

Hrithik Roshan Seemingly Confirms Jr. NTR On Board 'War 2' - Sacnilk

ఇక ఈ రోజు హృతిక్ రోష‌న్ ఎన్టీఆర్‌కు బ‌ర్త్ డే విషెస్ చెపుతూ ప్రియ‌మైన మిత్రునికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అని తెలుగు మెసేజ్ ఇంగ్లీష్‌లో పెట్ట‌డంతో పాటు యుద్ధ‌భూమిలో క‌లుద్దాం మిత్ర‌మా అంటూ కామెంట్ చేశాడు. దీనిని బ‌ట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్ న‌టిస్తున్నాడ‌ని.. అటు నెగ‌టివ్ రోల్ అని క్లారిటీ ఇచ్చిన‌ట్ల‌య్యింది.

Happy Birthday @tarak9999! Wishing you a joyous day and an action packed year ahead. Awaiting you on the yuddhabhumi my friend. May your days be full of happiness and peace

…until we meet 😉

Puttina Roju Subhakankshalu Mitrama 🙏🏻

— Hrithik Roshan (@iHrithik) May 20, 2023