సినిమా ఇండస్ట్రీలో అందంగా ఉండడం ఎంత ఇంపార్టెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ఈ గ్లామరస్ ఫీల్డ్ లో గ్లామర్ గా కనిపించకపోయినా బోర్ కొట్టేసిన జనాలు మన ముఖం కూడా చూడరు. అప్పుడు డైరెక్టర్లు ఆ హీరోయిన్స్ కి అవకాశాలు ఇవ్వరు. ఈ క్రమంలోనే అందం కోసం పలువురు స్టార్ హీరోయిన్స్ అడ్డదారులు తొక్కుతూ ఉంటారు . కొంతమంది నాచురల్ గా అందంగా కనిపించడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నా.. మరి కొంతమంది మెడికల్ పద్ధతి ద్వారా అందంగా కనిపించడానికి ఇష్టపడుతూ ఉంటారు.
ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ త్రిష అంటూ కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వయసు 40 క్రాస్ చేసిన ఇప్పటికి 16 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది . నిన్న కాక మొన్న రిలీజ్ అయిన పోనియన్ సెల్వన్ సినిమాలో త్రిష ఎంత గ్లామరస్ గా కనిపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే ఇలాంటి క్రమంలోనే 35లోనే ఏజ్ అయిపోయినట్లు కనిపించే హీరోయిన్స్ 40 ప్లస్ లోను ఇంత సెక్సీగా ఎలా కనిపిస్తున్నారు అనే విషయంపై ఆరా తీయగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
హీరోయిన్ త్రిష కొన్ని మెడికల్ ప్రొడక్ట్స్ వాడుతుందని ..కొన్ని ఇంజక్షన్స్ వేయించుకుంటుందని.. ఆ కారణంగానే ఆమె ఇంత అందంగా ఉంటుందని .. కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు మరీ ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష ఇలాంటి ఇంజక్షన్స్ ఎక్కువగా వేయించుకుంటుందని.. ప్రజెంట్ అవి బాగానే అనిపించినా రానున్న రోజుల్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో హీరోయిన్ త్రిష పేరు వైరల్ గా మారింది..!!