మెగాస్టార్ కోసం స్టార్ హీరోయిన్ల మధ్య కోల్డ్ వార్.. అది ఏ స్థాయిలో ఉండేదంటే

మెగాస్టార్ చిరంజీవికి ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఆయనతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. ఎన్నో సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ముఖ్యంగా 1990లలో ఆయన ఏ సినిమా చేసినా అది భారీ హిట్ అయ్యేది. ఆయన సరసన ఎక్కువగా రాధ, విజయశాంతి హీరోయిన్లుగా చేసేవారు. వారి కాంబినేషన్లలో వచ్చిన ఎన్నో సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు. వారి జోడీ సినిమా కథలకు చక్కగా సరిపోయేవి. ఈ తరుణంలో వరుసగా ఎన్నో సినిమాలను చిరంజీవి-రాధ, చిరంజీవి-విజయశాంతి చేసుకుంటూ వచ్చారు. ఆ సమయంలో వీరిద్దరికీ చిరు సినిమాల విషయంలో గొడవలు జరిగేవని ప్రచారం ఉండేది. ముఖ్యంగా ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య కోల్డ్ వార్ నడిచేదని బహిరంగంగానే చెప్పుకునే వారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సినిమాలలో కొన్ని జోడీలు అంటే ప్రేక్షకుల్లో ఎంతో అభిమానం ఉంటుంది. వారి కాంబినేషన్‌లలో సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయి. అలాంటి జోడీలలో చిరంజీవి-విజయశాంతి, చిరంజీవి-రాధ జోడీలు ఉండేవి. ముఖ్యంగా విజయశాంతి, రాధలు చిరంజీవితో పోటీ పడి నటించే వారు. చూడచక్కగా ఉండే ఈ జోడీలు వెండితెరపై ఎన్నో మరపు రాని సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించాయి. ఇక చిరు సరసన సినిమా అంటే ఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది.. ఇదే ఈ ఇద్దరి మధ్య తగువులకు కారణమని ప్రచారం సాగేది. చిరంజీవి హీరోగా ఏ సినిమా రూపొందించాలనుకున్నా, రాధ-విజయశాంతిలో ఎవరు ఖాళీ ఉంటే వారిని సినిమాకు ఎంపిక చేసే వారు.

రాధ బిజీగా ఉంటే విజయశాంతితో, విజయశాంతి కాల్షీట్లు దొరకకపోతే రాధతో డైరెక్టర్లు సినిమాలు చేసేవారు. అనుకోని కారణాల వల్లనో, బిజీ షెడ్యూల్ వల్లనో తమకు సినిమా అవకాశం, అందులోనూ చిరు సరసన నటించే అవకాశం కోల్పోతే ఎవరికైనా బాధగా ఉంటుంది. అందుకే విజయశాంతి-రాధలకు అస్సలు పడేది కాదని అంతా అనుకునే వారు. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో విజయశాంతి ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసింది. రాధ మాత్రం కెరీర్ మంచి ఊపు మీద ఉండగానే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.

Tags: chiranjeevi, Cold war, herions, Radha, senior actress, vijay shanthi