తెలుగు సినీ హీరోలపై ర‌కుల్‌ప్రీత్ సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చిత్ర సీమలో ఉన్నా వాస్త‌వానికి దగ్గరగా కొంత మంది జీవిస్తుంటారు. అలాంటి వారిలో ఢిల్లీ భామా రకుల్ ప్రీత్ సింగ్ ఒక‌ర‌ని త‌ప్ప‌క చెప్పుకోవాలి. సినిమాకు సంబంధించిన అంశాల్లో ఆమెకున్న స్ప‌ష్ట‌త మరే హీరోయిన్‌కు లేదంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీలో ఏం చేస్తే అవకాశాలు వస్తాయి అనే విష‌యం రకుల్‌కు ఒంట‌బ‌ట్టిన పాఠం. ఈ భామా చాలా కాలంంగా ఐదేళ్ల క్రితం వ‌ర‌కు తెలుగుతెర‌ను ఏలిన ఈ భామా ఈ మ‌ధ్య కాలంలో క‌నిపించ‌డం త‌గ్గిపోయింది. అయినా ఇప్పటికీ అగ్ర‌తార‌గానే ఆఫర్స్ అందుకుంటుండ‌డం విశేషం. టాలివుడ్‌కు దూర‌మైనా ప్ర‌స్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. అందుకోస‌మే త‌న మ‌కాంను ఏకంగా ముంబైకే మార్చేసింది. అక్కడే సినిమాలు చేసుకుంటుంది.

ఇటీవ‌లే ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ భామా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. తెలుగు హీరోల‌పై ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌ను చేసింది. టాలివుడ్ ఇండ‌స్ర్టీకి సంబంధించిన ప‌లు నిజాల‌ను బ‌య‌ట‌పెట్టింది. తన కెరీర్ ఆరంభంలో చాలా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయని బాధ పడింది. అయినా ఆ సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయని చెప్పుకొచ్చింది ఈమె. హీరోయిన్స్ పారితోషికంపై మాట్టాడిన ర‌కుల్ .. హీరో, హీరోయిన్ స‌మానం. వాళ్లు కష్టపడినట్లే మేం కూడా కష్టపడుతున్నాం అని సింపుల్‌గా మాట్లాడింది. దక్షిణాది ఇండస్ట్రీలో హీరోయిన్ల కంటే హీరోలకు ఎక్కువగా ఇమేజ్ ఉంటుందని.. వాళ్లను చూడ్డానికి ప్రేక్షకులు థియేట‌ర్ల‌కు వస్తారనే నిజాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పింది రకుల్. అందుకే సౌత్‌లో హీరోలకు భారీ రెమ్యునరేషన్ ఉంటుందని, అందుకే తనెప్ప‌డూ వారితో స‌మానంగా పారితోషికం కావాల‌ని బెట్టు చేయలేదని, ఇక ముందూ చేయ‌బోన‌ని రకుల్ క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్గా మారాయి. ఇదిలా ఉండ‌గా ర‌కుల్‌కు ఉన్న ఈ మాత్రం క్లారిటీ లేక అనేక మంది స్టార్ హీరోయిన్ అయ్యే అవ‌కాశాల‌ను కాల‌ద‌న్నుకుంటున్నార‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags: fans following, heroin rakulpreeth sing, movie remunaration