అర‌వింద్ కేజ్రీవాల్‌కు సీఎం జ‌గ‌న్ ట్విట్‌

జాతీయ పార్టీల‌ను ఢీకొట్టి మ‌రోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, మాజీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. మొత్తం 70 స్థానాల్లో 58 స్థానాల‌ను కైవ‌సం చేసుకున్నారు. సుమారు 55 శాతం మ‌ద్ద‌తును ద‌క్కించుకున్నారు. ఆప్ చీపురు దాఠికి కాంగ్రెస్ స‌హా ప‌లు పార్టీలు ఊడ్చు పెట్టుకుపోయాయి. ఎంపీ ఎన్నిక‌ల్లో చ‌క్రం తిప్పిన క‌మ‌లం, అసెంబ్లీకి వ‌చ్చేస‌రికి కేవ‌లం 12 స్థ‌నాల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల్లో ఘ‌న విస‌యం సాధించిన కేజ్రీవాల్‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు ప్రముఖులు అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు. అదీగాక ప్రాంతీయ పార్టీల నేత‌లు సంబురాలు చేసుకుంటున్నారు. త‌మ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌శ్చిమ బంగా సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు ట్వీట్ చేశారు. ఏఏపీకి శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఐదేళ్ల పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆశిస్తున్నానంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.

Tags: aam aadmi party cheaf aravindh kejriwall, ap cm jagan mohan, wishes