ఆదాయ పన్ను శాఖ కన్ను చిత్రసీమపై పడింది. వరుసగా ప్రముఖ తారల ఇళ్లపై దాడులను చేస్తున్నది. సోదాలను నిర్వహిస్తున్నది. దీంతో సినీలోకం బెంబేలు ఎత్తుతున్నది. అసలు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నది. ఇటీవలే సరిసిలేరు సినిమా విడుదల తర్వాత ప్రిన్ష్ మహేష్‌బాబు ఇంటిని ఐటీ అధికారులు సోదా చేశారు. అంతకు ముందు కూడా ఇలాగే నాగార్జున, వెంకటేష్ వంటి బడా హీరోల ఇళ్లపై దాడులు చేసి తనికీలు చేశారు. అదేబాటలో ఇటీవల నానీ, లావణ్య త్రిపాఠి, సుమా, అనసూయ ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు.
తాజాగా ఐటీ అధికారుల నజర్ కోలివుడ్ స్టార్ ఇలయరాజ విజయ్ సేతుపతిపైనా పడింది. ఏకంగా కడలూర్ జిల్లా నైవేలీలో షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్న విజయ్ వద్దకే అధికారులు వెళ్లి వివరాలపై ఆరా తీయడం చర్చనీయాంశంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే విజయ్ హీరో ఏజీఎస్ సంస్థ నిర్మించిన బిగిల్ ఇటీవలే విడుదలైంది. బాక్సాఫీసు వద్ద రూ. 120 గ్రాస్‌ను షేర్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు సంబంధించిన లెక్కలను సరిగా చూపకపోవడంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం. విజయ్‌తో పాటు ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, ప్రముఖ ఫిల్మ్ ఫైనాన్షియర్ అన్బు చెలియన్ కార్యాలయంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఐటీ శాఖ వరుసగా చేస్తున్న దాడులతో చిత్ర పరిశ్రమ బెంబేలు ఎత్తిపోతున్నది.