కార్తికేయ-2 కు నార్త్ లో అంచనాలకు మించి కలెక్షన్స్..నిఖిల్ ట్వీట్ వైరల్..!

టాలీవుడ్ లో ఇప్పుడున్న యువ హీరోలు అందరికీ భిన్నంగా ప్రత్యేక చిత్రాలు చేస్తున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. వరుసగా విజయాలు అందుకొంటున్నాడు. తాజాగా అతడు చందు మొండేటి దర్శకత్వంలో చేసిన కార్తికేయ 2 సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగుతో పాటు నార్త్ లో కూడా ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా బాగుందని మౌత్ టాక్ రావడంతో ఆ సినిమా ఆడుతున్న థియేటర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

ఒకవైపు అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి బడా హీరోలు నటించిన సినిమాలు విడుదల అయినప్పటికీ ఆ సినిమాలకు ఫ్లాప్ టాక్ రావడంతో కార్తికేయ 2 సినిమాకు కలిసివచ్చింది. విడుదలైన తొలి రోజు ఈ సినిమా నార్త్ మొత్తానికి గాను 50 థియేటర్లలో ఆడింది. ప్రస్తుతం ఈ సినిమా 1000 స్క్రీన్స్ లో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే మూడు వేల షోలకు దగ్గరై రికార్డు సృష్టిస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎలా మెల్లగా సూపర్ హిట్ గా నిలిచిందో అదేవిధంగా కార్తికేయ2 కూడా రోజురోజుకు కలెక్షన్లు పెంచుకుంటూ దూసుకుపోతోంది. దీనిపై నిఖిల్ సిద్ధార్థ్ ఒక ట్వీట్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘మొదటి రోజు 50 కేంద్రాల్లో మొదలైన మా సినిమా ఇప్పుడు 1000 కేంద్రాల్లో ఆడుతోంది. ఆరు రోజుల్లో 3000 షోలు పూర్తి చేసుకోబోతోంది. ప్రేక్షకులు ఈ వీకెండ్ థియేటర్లకు వచ్చి తమ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి’ అని నిఖిల్ ట్వీట్ చేశారు.

Tags: hero nikhil siddarth, hero nikhil tweet, karthikeya 2 movie collections, karthikeya2 movie