ఈ యంగ్ హీరో మామూలోడు కాదు.. ఒక్క ఛాన్సివ్వు అంటూ వెనకాలపడుతున్న బాలీవుడ్ ..!

హ్యాపీ డేస్ సినిమాలో ఒక హీరోగా నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఆ తర్వాత వరుసగా పరాజయాలు పలకరించి నప్పటికీ యువత సినిమాతో తొలి సోలో హిట్ అందుకున్నాడు. స్వామిరారా, కార్తికేయ సినిమాలతో టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా అతడి క్రేజ్ ని అమాంతం పెంచేసింది.

ఊహించని విధంగా ఈ సినిమా బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. దీంతో ఒక్కసారిగా నిఖిల్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం నిఖిల్ తెలుగులో స్పై, 18 పేజెస్ సినిమాల్లో నటిస్తుండగా.. ఆయనతో సినిమాలు తీసేందుకు పలు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు వెంట పడుతున్నాయి. కార్తికేయ 2 సినిమా ఇప్పటికే బాలీవుడ్లో 25 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో అతడి తో సినిమా చేసేందుకు బాలీవుడ్ కు చెందిన పలు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.

ఈ విషయం గురించి నిఖిల్ ఓ బాలీవుడ్ మీడియా చానెల్ తో మాట్లాడుతూ హిందీ కి చెందిన రెండు ప్రొడక్షన్ హౌస్ లు తమ రాబోయే చిత్రాల కోసం తనను సంప్రదించినట్లు తెలిపాడు. అయితే ఈ సినిమాల్లో నటించడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. కార్తికేయ 2 సినిమా హిట్ అయిన తర్వాత పలువురు హిందీ నటులు తనను వ్యక్తిగతంగా పిలిచి అభినందనలు తెలిపినట్లు వెల్లడించాడు.

కాగా ఇప్పటికే తెలుగు నుంచి ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారి హిందీలో సినిమాలు చేస్తుండగా.. చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో గ్రాండ్ అందుకున్నారు. లైగర్ మూవీ తో విజయ్ దేవరకొండ బీ టౌన్ లో అడుగుపెట్టాడు. మరి నిఖిల్ కూడా కార్తికేయ 2 సూపర్ హిట్ తో హిందీలో నేరుగా సినిమా చేస్తాడేమో వేచి చూడాలి.

Tags: actor nikhil, bollywood cinimas, tollywood actors, tollywood cinima updates, tollywood heros