యువ‌హీరో నాగ‌శౌర్య‌పై హెచ్చార్సీలో ఫిర్యాదు

చిత్ర ప‌రిశ్ర‌మ అంటేనే అంత‌. ఒక మంచి విజ‌యాన్ని చ‌విచూసిన వెంట‌నే ఏదో ఒక వివాదం చుట్టుముడుతుంది. సినిమా స‌క్సెస్‌ను ఆస్వాదించే ప్ర‌శాంత‌త‌ను లేకుండా చేస్తుంది. ఇప్ప‌డు యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య ప‌రిస్థితి అలాగే త‌యారైంది. చ‌లో సినిమాతో ప్ర‌త్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాగ‌శౌర్య ఇటీవ‌లే అశ్వ‌త్థామా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రం కొంచెం నెగిటివ్ టాక్‌తో మొద‌లైనా ఆ త‌రువాత పాజిటివ్ బ‌జ్‌ను సంపాదించుకుంది. ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేసి లాభాల బాట ప‌ట్టింది. నాగౌశౌర్య క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కింది. బాక్సాఫీసు వ‌ద్ద కాసుల‌ను కురుపిస్తున్న‌ది. అంత‌లోనే నాగ‌శౌర్య వివాదంలో చిక్కుకున్నాడు.

విష‌యం ఏమిటంటే అశ్వ‌త్థామ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఇటీవ‌లే ఆ యువ‌హీరో ఓ టీవీ చాన‌ల్‌కు ప్ర‌త్యేక ఇంట‌రూ్వ్య‌ను ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ డ్రైవ‌ర్ట‌ల‌కు సంబంధించిన అంశంపై వ్యాఖ్య‌త ప్ర‌శ్న‌లు సంధించ‌గా నాగ‌శౌర్య స‌మాధానాల‌ను చెప్పాడు. అయితే యువ క‌థ‌నాయ‌కుడు డ్రైవ‌ర్ల‌ను తాగుబోతులుగా, జులాయిల‌ని, చ‌దువురాని వార‌ని అర్థం వ‌చ్చేలా అస‌భ్య‌క‌రంగా వివ‌రించార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విష‌యమై డ్రైవ‌ర్ల సంఘం నేత‌లు మాన‌వ‌హ‌క్కుల సంఘాన్ని ఆశ్ర‌యించారు. యువ క‌థానాయ‌కుడిపై ఫిర్యాదు చేశాడు. త‌మ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశాడ‌ని వాపోయారు. ఇదిలా ఉండ‌గా యువ హీరో గ‌తంలోనూ ఇలానే వ్య‌క్తిగ‌త కామెంట్లు చేసి వార్త‌ల్లో నిలిచాడు. చ‌లో సినిమా ధ‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌పై ఆయ‌న వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారాయి. త‌న అమ్మ‌కొనిచ్చిన కారు వాడ‌కుండా దూరం పెట్టాడ‌డ‌ని, త‌న‌ను జీవితంలో క్ష‌మించ‌బోన‌ని తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

Tags: drivers, hero nagashourya, human rights commission