ఆంధ్రప్రదేశ్ లో తాజాగా మరో సంచలనం

గత కొన్నాళ్ళుగా సంచలనాలు నమోదు అవుతున్న ఆంధ్రప్రదేశ్ లో తాజాగా మరో సంచలనం నమోదు అయింది. రాష్ట్రంలో దాదాపుగా 20 లక్షల వరకు తెల్ల రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం లేపెయడానికి రంగం సిద్దమైంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12వేలు ఆదాయం కంటే ఎక్కువ ఉంటే తెల్ల రేషన్ కార్డుకి అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది.

స్వీపర్లు, శానిటరీ వర్కర్లు, సఫాయి కర్మచారి వర్కర్లుగా పనిచేస్తూ ఎంత వేతనం పొందుతున్నా వారికి వచ్చే ఇబ్బందులు ఏమీ లేవు. పది ఎకరాలు కంటే ఎక్కువ భూమి ఉంటే వారు అర్హులు కాదు. అదే విధంగా ఆ పొలంలో మాగాణి 3ఎకరాలకు మించి ఉన్నా రేషన్ కార్డు ఇవ్వరు.  పదెకరాలు మెట్ట ఉన్నా సరే కార్డు ఉండదు. అదే విధంగా నాలుగు చక్రాల వాహనం ఉన్నా వాళ్లకు కార్డు ఉండదు.

ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్లు కలిగిఉన్న కుటుంబాలకు ఇది వర్తించదు. రెసిడెన్షియల్‌ కేటగిరీలో విద్యుత్‌ వినియోగం నెలకు 300యూనిట్లు దాటకుండా ఉండాలి. సొంతిల్లు అయినా, అద్దె ఇల్లు అయినా మరేదైనా సరే. ఇప్పుడు తొలగించాలని ప్రభుత్వం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసింది. దాదాపు 20 లక్షల కుటుంబాలకు కార్డు రద్దు అయ్యే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ అంటుంది.

అయితే భూమి విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమలో 10 ఎకరాల భూమి ఉన్న వాళ్లకు పూట గడవని పరిస్థితి ఏర్పడింది. నీళ్ళు లేక ఎన్నో వేల ఎకరాలు కనీసం పచ్చి గడ్డికి కూడా దిక్కు లేదు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటీ అంటున్నారు. ఉద్యోగం చేస్తూ రెండు లక్షల్లో కారు కొనుక్కున్న వాడికి కార్డు లేపేయడం ఏంటీ అనే ప్రశ్న వినపడుతుంది.

ఇక ఇప్పుడు రేషన్ కార్డు లేపేస్తే ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ కార్యక్రమాలు ఆగిపోయే ప్రమాదం ఉంది. దీనితో ప్రజల్లో భయాలు మొదలయ్యాయి. ఇప్పటికే పెన్షన్, వంటివి 300 యూనిట్ల విద్యుత్ వాడకమని చెప్తూ ఆపేశారు. ఇప్పుడు ఈ రేషన్ కార్డుల తొలగింపుతో దాదాపు 60 లక్షల మంది వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని ప్రాధమికంగా అంచనా ఆ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్య౦ లేదు.

Tags: AP, Cancellation, White Ration Cards, YS Jagan, ysrcp