టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున ఈమధ్య చాలా ఇబ్బందుల్లో పడుతున్నాడు. మన్మధుడు టు సినిమా తీసినప్పుడు అతనిపై ఎన్ని విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నాగ చైతన్య, సమంత విడిపోయినప్పుడు కూడా అతనిపై కొన్ని పుకార్లు వచ్చాయి. అనేక రూల్స్‌తో సమంతని నాగార్జున టార్చర్ పెట్టాడని, అందుకే ఆమె విడాకులు తీసుకుందని కొందరు దుష్ప్రచారాలు కూడా చేశారు. ఇప్పుడిప్పుడే అక్కినేని కుటుంబం ఇలాంటి నెగిటివిటీ నుంచి బయట పడుతోంది. ఈనేపథ్యంలోనే అతని చిన్న కొడుకు అఖిల్ చేసిన పనికి ఇప్పుడు నాగ్ మళ్లీ తలెత్తుకోలేకపోతున్నాడట.
ఇంతకీ అఖిల్ చేసిన పని ఏంటంటే.. ఈ హీరో ఇటీవల ఒక పబ్‌కు వెళ్లాడు. ఆ తర్వాత అక్కడ హల్ చల్ చేస్తూ కెమెరాల కంటికి కనిపించాడు. అతని ప్రవర్తనతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. ఎవరాపినా ఆగకుండా రెచ్చిపోయిన అఖిల్ఒ క వ్యక్తితో అసభ్యంగా కూడా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దాంతో పబ్లిక్‌లో తన ఇమేజ్‌ను దిగజార్చిన అఖిల్‌పై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. అయితే నాగ్ ఎప్పుడూ తన పిల్లలపై అరవడు. కానీ పబ్లిక్‌గా ఇలాంటి పనులు చేస్తూ కుటుంబ పరువు తీయవద్దని అఖిల్‌కి గట్టిగానే చెప్పాడట. ఆపై తన ప్రవర్తనను మార్చుకోవాలని కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌లో ఒక స్టార్‌గా అఖిల్ ని నిలబెట్టేందుకు నాగార్జున అహర్నిశలు శ్రమిస్తున్నాడు. హ్యాండ్‌సమ్ లుక్స్, మంచి హైట్, వెయిట్ అనేవి అఖిల్ టాప్ స్టార్‌గా ఎదగడానికి బాగా ఉపయోగపడతాయి. కానీ కథల ఎంపిక విషయంలో ఫెయిల్ కావడం వల్ల అతని మొదటి మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అక్కినేని ప్రిన్స్‌గా ఫ్యాన్స్ పిలుచుకునే ఈ హీరో తన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో ఎట్టకేలకు ఒక హిట్ కొట్టాడు. దీంతో నాగార్జున ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడు అఖిల్ స్పై థ్రిల్లర్ ఏజెంట్‌తో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.