ఇటీవల జరిపిన ఓ పరిశోధన ప్రకారం ప్రపంచంలోనే ఇతర దేశాలతో పోలిస్తే దక్షిణాసియా దేశ ప్రజల్లోని గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకు జీన్స్ మాత్రమే కాదు.. మారుతున్న జీవన శైలి కూడా కారణమని పరిశోధికులు తేల్చీ చెప్పారు. 2030నాటికి ఇండియాలో 80 మిలియన్స్ మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారని అంచనా. మన దేశ జనాభాలో సుమారు 10% యువత ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ఉప్పు, కొవ్వు, చక్కెర అధిక ఉండే ఆహారాన్ని అతిగా తినడం కూడా ఒక కారణం. ఇప్పుడు చిన్న వయసులోనే చాలామందికి గుండెపోటు లాంటి సమస్య ఎదురవుతుంది.
గుండెపోటు కి సంకేతాలు ఇవి:
• గుండె చాలా భారంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది.
• రక్త సరఫరా తగ్గి గుండెలో మంటగా ఉంటుంది.
• మత్తుగా ఉండి చమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి.
• తీవ్రమైన అలసట చేతి దగ్గర నొప్పి వస్తు ఉంటుంది.
• రీర పై భాగం నుంచి ఎడమ చేతి కింద వరకు నొప్పిగా అనిపిస్తుంది.
ఈ సంకేతాలు ఎవరికైనా ఉన్నట్లయితే తొందరగా డాక్టర్ని సంప్రదించండి.
అలాగే గుండెపోటు రాకుండా ఎలా చూసుకోవాలో ఇప్పుడు చూద్దాం:
• గుండె పోటులు రాకుండా ముందు నుంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.
• మీ కుటుంబంలో ఎవరికైనా ఉబకాయం, గుండె జబ్బులు ఉన్నట్లయితే ముందస్తు స్కానింగ్ చేయించుకోవాలి.
• ఆరోగ్యానికి హాని చేసే ఫుడ్ను దూరంగా ఉంచాలి.
• ఆయిల్ ఫుడ్ ని ఎక్కువగా వాడకూడదు.
• కొవ్వు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు పండ్లు, కూరగాయలు లాంటి ఆహారం తినాలి.