శ్రీరెడ్డికి ఇంట‌ర్ చ‌దివే కూతురు ఉందా… బ‌య‌ట ప‌డ్డ టాప్ సీక్రెట్‌..!

శ్రీ రెడ్డి.. ఈ హాట్ బ్యూటీకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదగాలనుకుంది. అయితే ఈమె నటించిన రెండు సినిమాలు ఫ్లాప్‌ కావడంతో ఆ తర్వాత సినిమా అవకాశాలు రాలేదు. దాంతో సినిమా అవకాశాల కోసం కొంతమంది స్టార్ హీరోల వద్దకు వెళ్లి వారి చేతిలో మోసపోయింది. ఆ తర్వాత ఆ హీరోల‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. అయినా న్యాయం జ‌ర‌గ‌లేద‌ని ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ద‌ నగ్నంగా నిరసన చేసింది.

Sri Reddy cute image gallery | Saree, Indian bridal photos, Actresses

దీంతో ఆమె వ‌ల్ల ఇండ‌స్ట్రికి బ్మాడ్ నేమ్ వ‌స్తుంద‌న్న‌ ఉద్దేశంతో ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు. ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇప్పటికీ తన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకుంటూనే ఉంది. చాలామంది స్టార్ హీరోల‌పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూనే ఉంది. అయితే తాజాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వంటలు ప్రోగ్రామ్స్ తో పాపులారిటీ తెచ్చుకుంది.

Actress Sri Reddy Letter To SHE Team - SouthColors

శ్రీరెడ్డికి పెళ్లయి ఇంటర్ చదివే కూతురు ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇది నిజమో.. కాదో కాని… శ్రీరెడ్డి ఇంటర్ వరకు చదివి తర్వాత బ్యూటీ పార్లర్ పెట్టింది. తల్లిదండ్రులకు ఆమె బిహేవియర్ నచ్చకపోవడంతో ఆమెకు మంచి సంబంధం చూసి వివాహం చేశారు. కొన్ని రోజులు అతడితో కలిసి కాపురం చేసిన శ్రీరెడ్డి ఒక పాప పుట్టిన తర్వాత లైఫ్ లో ఎడ్జెస్ట్ అవ‌డం నచ్చలేదంటూ అతడికి విడాకులు ఇచ్చేసి.. పాపను వదిలేసి స్నేహితులతో కలిసి హైదరాబాద్ వచ్చేసిందట.

Picture 1468191 | Actress Sri Reddy Hot Photos

ఆ తర్వాత హీరోయిన్ ఛాన్సుల కోసం ట్రై చేస్తూ ఏదో ఒక జాబ్ చేస్తూ తనని తాను పోషించుకుంది. శ్రీ రెడ్డి కూతురు ఇటీవల ఇంటర్ కంప్లీట్ చేసుకుంద‌ని… ఆమె శ్రీ రెడ్డిని తన తల్లిగా ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేద‌ని.. ఆమె ఆల‌నా, పాల‌నా శ్రీరెడ్డి త‌ల్లిదండ్రులే చూస్తున్నార‌ని చ‌ర్చ న‌డుస్తోంది. శ్రీ రెడ్డికి పెళ్లి అయ్యాక‌.. భ‌ర్త‌ను వదిలేసిన మాట వాస్తవమే.. కాని వారి ఇద్దరికీ ఒక పాప ఉందన్న విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు. కాగా ప్రస్తుత ఈ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది.